అప్పుడు ఇప్పుడు అంటూ ఇప్పటి వరకు ఊరిస్తూనే ఉంది ‘ఆర్‌ఆర్ఆర్’. రామ్ చరణ్, తారక్ లాంటి ఫేమస్ స్టార్స్‌తో రాజమౌళి లాంటి డైరెక్టర్ సినిమా తీస్తే ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ప్రేక్షకులు ఆరాటపడటం సహజమే. కానీ అడుగడుగునా కరోనా అడ్డుపడటంతో అభిమానుల వెయిటింగ్ టైమ్ పెరుగుతూ వచ్చింది. జనవరి 7 నుంచి వాయిదా పడ్డాక ఈమధ్యనే రెండు కొత్త డేట్స్‌ని ప్రకటించింది జక్కన్న టీమ్.
మార్చ్ 18న కానీ, ఏప్రిల్ 28న కానీ వస్తామని కన్‌ఫర్మ్ చేసింది. అయితే మార్చ్ 17న కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా ‘జేమ్స్’ రిలీజవుతోంది కాబట్టి ఆరోజు కానీ, దానికి దగ్గర్లో కానీ మరో సినిమా రిలీజ్ కాకూడదని శాండిల్‌వుడ్ డిసైడ్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి, కన్నడలో కూడా రిలీజవుతుంది కాబట్టి మొదటి డేట్‌కి మానేసి ఏప్రిల్ 28నే వస్తుందని ఫిక్సైపోయారంతా.
అయితే అదీ ఇదీ కాకుండా మధ్యలో మరో డేట్‌ని లాక్ చేసి అందరికీ షాకిచ్చాడు రాజమౌళి. మార్చ్ 25న ఆర్‌ఆర్‌ఆర్‌ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. శ్లాట్ ఖాళీగా ఉంది కదా అని ఆల్రెడీ రవితేజ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’కి అదే రోజు ముహూర్తం పెట్టుకున్నాడు.
పెద్దగా రిస్క్ లేదు కదా అని ఆ తర్వాతి వారం, అంటే ఏప్రిల్ 1న ఆచార్య, సర్కారు వారి పాట ఖర్చీఫులు వేసుకున్నాయి. సర్కారు వారి పాట పోస్ట్‌పోన్ అవుతుందని ఆల్రెడీ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజమౌళి నిర్ణయంతో ఆచార్య మరోసారి చిక్కుల్లో పడింది. ఇక మార్చ్ 4న రాధేశ్యామ్‌ని విడుదల చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ దెబ్బతో ఆ డెసిషన్ కూడా మారిపోవడం ఖాయం.
This post was last modified on January 31, 2022 9:47 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…