హీరోలుగా మార్కెట్ కోల్పోయి, అవకాశాలు తగ్గిపోయిన సీనియర్లలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, నరేష్.. ఇలా చాలామందే కనిపిస్తారీ కోవలో. ఈ తరం నటుల్లో ఒకరైన రాజశేఖర్ సైతం ఎప్పుడో మార్కెట్ కోల్పోయిన వాడే. కానీ ఆయన ఇప్పటికీ హీరోగానే నటిస్తున్నారు. ఐతే ఆయన కూడా క్యారెక్టర్ రోల్స్‌లోకి మారుతాడని ఎప్పట్నుంచో సంకేతాలు వస్తున్నాయి.
ఫలానా సినిమాలో ఫలానా పాత్రలో కనిపించబోతున్నాడంటూ ఇంతకుముందు రకరకాల ప్రచారాలు జరిగాయి. ఆయన కూడా ‘ధ్రువ’లో అరవింద్ స్వామి చేసిన టైపు పాత్రలు ఆఫర్ చేస్తే చేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని అంటూనే ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఆయన క్యారెక్టర్ రోల్ మాత్రం చేయలేదు. గతంలో దర్శకుడు తేజ.. రాజశేఖర్‌కు ఇలాంటి రోల్ ఒకటి ఇచ్చి సినిమా చేయాలనుకున్నా అది వర్కవుట్ కాలేదు. ఆ సినిమా మొదలైనట్లే మొదలై ఆగిపోయింది. ఐతే ఎట్టకేలకు యాక్షన్ హీరో గోపీచంద్ సినిమాలో రాజశేఖర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
తనకు లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్లు గోపీచంద్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి క్రేజీ మూవీలో రాజశేఖర్ క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడనగానే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కానీ ఇంతలో ఏమైందో ఏమో.. ఈ సినిమా నుంచి రాజశేఖర్ బయటికి వచ్చేసినట్లు ఇప్పుడు వార్తలొస్తున్నాయి.
మరి క్యారెక్టర్ నచ్చక ఆయనే బయటికి వెళ్లిపోయారా.. లేక ఎప్పుడూ సెట్‌కు లేటుగా వస్తారని, జీవిత జోక్యం ఎక్కువ అనే టైపు కంప్లైంట్లతో ఆయన్ని తప్పించారా అన్నది తెలియడం లేదు. మొత్తానికి ఒక క్రేజీ కాంబినేషన్ చూద్దామనుకున్న ప్రేక్షకులకు నిరాశ తప్పడం లేదు. రాజశేఖర్ చేయట్లేదంటే ఇక ఆటోమేటిగ్గా కనిపించే ఛాయిస్ జగపతిబాబే. ఆయన ఇలాంటి పాత్రలు చాలానే చేశారు. గోపీచంద్-శ్రీవాస్ కలయికలో వచ్చిన ‘లక్ష్యం’లో కూడా జగపతి మంచి పాత్ర చేయడం తెలిసిందే.
This post was last modified on January 31, 2022 3:20 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…