ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే.. ఒక్క సాలిడ్ హిట్ కెరీర్‌ని మలుపు తిప్పగలదు. అలాగే ఎంత పెద్ద హిట్ కొట్టినా సరే.. దాన్ని నిలబెట్టుకోలేకపోతే వరుస పరాజయాలు కెరీర్‌ని దెబ్బ తీయగలవు. కీర్తి సురేష్ విషయంలో ఈ రెండూ జరిగాయి. నేను శైలజ, నేను లోకల్ లాంటి ఒకట్రెండు సినిమాలు తప్ప ఆమె కెరీర్‌లో అన్నీ ఫెయిల్యూర్సే. కానీ ‘మహానటి’ సినిమా ఆమె కెరీర్‌ని మార్చేసింది. ఒక్కసారిగా స్థాయిని మార్చేసింది. దాంతో ఆ తర్వాత కీర్తి సురేష్ ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. దానికి కారణం.. ఆమె ప్లానింగ్ మిస్‌ఫైర్ అవ్వడం.
అవును. మహానటి తర్వాత కీర్తి కెరీర్‌ని పరిశీలిస్తే ఆ విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ సినిమాతో వచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఫిమేల్ సెంట్రిక్ మూవీస్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన కీర్తి.. పెంగ్విన్, మిస్ లాంటి అట్టర్ ఫ్లాపుల్ని ఖాతాలో వేసుకుంది. మధ్యలో కొందరు హీరోలతో జోడీ కట్టింది కానీ అవేమీ ఆమెకి కలిసి రాలేదు. కానీ చాలా గ్యాప్ తర్వాత ‘సర్కారువారి పాట’ పుణ్యమా అని స్టార్ హీరోతో జోడీ కట్టే చాన్స్ వచ్చింది. అయినా కూడా ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలపై ఆమెకి మక్కువ తీరలేదు. అందుకే గుడ్‌లక్ సఖి లాంటి మరో ఫెయిల్యూర్‌ని చేతులారా ఆహ్వానించి బ్యాగ్‌లో వేసుకుంది.
ఆమె ప్రయోగాల చిట్టా ఇంతటితో ఆగిపోలేదు. స్ట్రాంగ్ రోల్స్‌గా ఫీలయ్యి కొన్ని పాత్రలు యాక్సెప్ట్ చేసి దెబ్బ తింటోంది. ‘అన్నాత్తే’లో రజినీకాంత్‌కి చెల్లెలి పాత్ర చేసింది. ఈ సినిమా కోసం ఆమె పొన్నియిన్ సెల్వన్, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో ఆఫర్స్‌ని వదిలేసుకుందట. వీటిలో మొదటిది భారీ చిత్రం. క్లిక్ అయితే ఒక ఎపిక్‌లా మిగిలిపోతుంది. ఇక రెండోది ఆల్రెడీ విడుదలై సూపర్ హిట్టు కొట్టింది. అద్భుతంగా క్లిక్ అయిన దేవదాసీ పాత్రలో కనిపించి కాంప్లిమెంట్స్ అందుకునే సూపర్బ్ చాన్స్‌ను కీర్తి మిస్ చేసుకుంది. ఇంతా చేసి ‘అన్నాత్తే’ వల్ల ఆమెకేమైనా కలిసొచ్చిందా అంటే అదీ లేదు. అసలు ఆ క్యారెక్టర్‌కి ఆమె ఎందుకు ఒప్పుకుంది అనే నెగిటివ్ కామెంట్స్ మాత్రమే మిగిలాయి.
అయినా కూడా ‘భోళాశంకర్’లో చిరంజీవికి చెల్లెలిగా నటించడానికి ఓకే చెప్పింది. ఆ మూవీకి మాతృక అయిన ‘వేదాళం’ చూసిన వాళ్లెవరైనా ఆ పాత్రకి కీర్తి అవసరం లేదని చెబుతారు. అయినా కీర్తి ఎందుకు ఓకే చెప్పిందనేది ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్నే. మరోవైపు డీ గ్లామరస్ పాత్రలకి ఎస్ చెబుతూ మరో రకం ఎక్స్‌పెరిమెంట్స్ కూడా చేస్తోంది కీర్తి. ‘సాని కాయిదమ్’లో సెల్వ రాఘవన్‌తో కలిసి ఒక రా రోల్ చేస్తోంది. నాని ‘దసరా’లో కూడా ఆమె డీ గ్లామరస్‌గానే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలకి పెయిర్‌గా కనిపించేంత డిమాండ్ ఉన్నప్పుడు కీర్తి ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తోందో, మళ్లీ మళ్లీ ఎక్కడ దెబ్బ తింటుందోనని ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. వారి భయం నిజం కాకుండా ఉంటే పర్లేదు మరి.
This post was last modified on January 31, 2022 9:36 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…