ఈ మధ్య యూట్యూబ్‌లో కొన్నివెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి.. 30 వెడ్స్ 21. కొత్త టాలెంట్‌కు ముందు నుంచి మంచి ప్రోత్సాహాన్నందిస్తూ ఫీల్ గుడ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌కు పేరుబపడ్డ ఛాయ్ బిస్కెట్ సంస్థ నుంచి గత ఏడాది వచ్చిన అందమైన వెబ్ సిరీస్ ఇది.
30 ఏళ్ల వయసున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. తనకంటే తొమ్మిదేళ్లు తక్కువ వయసున్న అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకోవడం.. వయసు అంతరం విషయంలో ఇబ్బంది పడటం.. దీని వల్ల ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం.. సంసార జీవితంలో చిన్నపాటి కల్లోలం రావడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య నెమ్మదిగా గొడవ సద్దుమణిగి ఒక్కటవ్వడం.. ఈ నేపథ్యంలో నడుస్తుందీ సిరీస్. ఆహా ఓహో అనిపించే సిరీస్ కాదు కానీ.. ప్రతి ఎపిసోడ్ ఆహ్లాదంగా.. సరదాగా సాగిపోవడంతో ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.
ఒక్కో ఎపిసోడ్ రిలీజవుతుంటే ఈ సిరీస్‌కు ఆదరణ అంతకంతకూ పెరిగిపోయి యూట్యూబ్‌లో ఇదొక బ్లాక్ బస్టర్ అయిపోయింది. సీజన్-1 ముగిసినపుడు అయ్యో అప్పుడే అయిపోయిందా అనుకున్నారు. అదే సమయంలో రెండో సీజన్ రాబోతోందని అప్ డేట్ ఇవ్వడంతో ప్రేక్షకులు సంతోషించారు. కొన్ని నెలలు టైం తీసుకుని ఇప్పుడు సీజన్-2ను రెడీ చేసేసింది ఛాయ్ బిస్కెట్ సంస్థ. ఒక చిన్న ప్రి టీజర్‌తో ఈ విషయాన్ని వెల్లడించింది.
త్వరలోనే ఫుల్ టీజర్ వదలబోతున్నారు. వచ్చే నెలలోనే రెండో సీజన్ స్ట్రీమ్ కాబోతోంది. ఈ సిరీస్‌లో పృథ్వీ, మేఘనలుగా లీడ్ రోల్స్ చేసిన చైతన్య రావు, అనన్యలకు ఎంత పేరొచ్చిందో తెలిసిందే. ఇద్దరికీ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. దర్శకుడు, రచయితలు కూడా మంచి పేరే సంపాదించారు.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం సీజన్-2 కోసం ఎదురు చూస్తున్నట్లు మెసేజ్ పెట్టడం విశేషం. మరి తొలి సీజన్ తర్వాత పెరిగిన అంచనాలను 30 వెడ్స్ 21 టీం ఏమేర అందుకుంటుందో చూడాలి.
This post was last modified on January 31, 2022 8:02 am
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పటికే మొన్నామధ్య సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్…
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…