మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలతో కొన్నేళ్ల కిందట మాంచి ఊపులో కనిపించాడు సీనియర్ హీరో నాగార్జున. కెరీర్లో ఆ దశలో అలాంటి హై చూస్తారని ఆయన ఊహించి ఉండరు. అలాగే రెండేళ్లు తిరిగేసరికి ఆఫీసర్ లాంటి సినిమాతో కెరీర్లోనే అత్యంత పేలవమైన దశను చూస్తానని కూడా ఆయన అంచనా వేసి ఉండరు. గత ఏడాది ఆయన్నుంచి వచ్చిన మన్మథుడు-2 కూడా పెద్ద డిజాస్టరే అయింది. ఇప్పుడాయన క్రాస్ రోడ్స్‌లో నిలబడి ఉన్నాడు. ఇక్కడి నుంచి ఆయన కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియడం లేదు. మహర్షికి రచయితగా పని చేసిన సాల్మన్‌కు దర్శకుడిగా తొలి అవకాశం ఇస్తూ వైల్డ్ డాగ్ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు నాగ్. చడీచప్పుడు కాకుండా ఈ సినిమాను మొదలుపెట్టి చివరి దశకు తీసుకొచ్చాడు నాగ్.
లాక్ డౌన్ లేకుంటే ఈ పాటికి ఈ సినిమా రిలీజయ్యేదేమో కూడా. ఐతే వైల్డ్ డాగ్ సంగతేమో కానీ.. ఈలోపు నాగ్ తన కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆయన కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించబోతున్నాడు. గరుడవేగ స్టయిల్లోనే ఒక కొత్త తరహా థ్రిల్లర్ కథ చెప్పి నాగ్‌ను మెప్పించాడట ప్రవీణ్. ఈ చిత్రం కోసం రెండు పెద్ద సంస్థలు చేతులు కలుపుతున్నాయి. నాగ్ తనయుడు నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాను నిర్మించిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్.. పవన్ కళ్యాన్‌తో వరుసగా మూడు సినిమాలు తీసిన నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అధినేత శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
This post was last modified on June 13, 2020 10:57 pm
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…