తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి.. తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మనసుల్ని ఆయన గాయపరచడమే. సంక్రాంతికి ‘భీమ్లానాయక్’ విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్న టైంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పండుగ బరిలో నిలిపి.. ఇండస్ట్రీ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి తెప్పించి ‘భీమ్లా నాయక్’ సినిమాను వాయిదా వేయించడం వాళ్లకు అస్సలు నచ్చలేదు.
‘ఆర్ఆర్ఆర్’ రేసులోకి వచ్చాక కూడా ‘భీమ్లా నాయక్’ను సంక్రాంతికే రిలీజ్ చేయాలని దాని నిర్మాతలు పట్టుదలతో ఉండటం.. ఇంకోవైపు పవన్ అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ వచ్చినా, ఇంకే భారీ చిత్రం వచ్చినా పవన్ సినిమా తగ్గేదే లేదు అని సవాళ్లు విసరడం.. తీరా చూస్తే రాజమౌళి అండ్ కో ఒత్తిడితో ‘భీమ్లా నాయక్’ వాయిదా పడటంతో వాళ్లకు తల కొట్టేసినట్లు అయి జక్కన్న పట్ల తీవ్ర వ్యతిరేక భావం ఏర్పడి ట్రోల్ చేయడం జరిగింది.
ఈ విషయంలో న్యూట్రల్ ఫ్యాన్స్‌లోనూ రాజమౌళి పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది. ఇంతకుముందేమో పోటీ ఉంటే ఇబ్బంది లేదని, ఒకేసారి ఎన్ని సినిమాలైనా రిలీజ్ చేయొచ్చని, ఏది బాగుంటే అది చూస్తారని మాట్లాడి.. తర్వాత తెర వెనుక ప్రయత్నాలతో వేరే సినిమాలను వాయిదా వేయించడమే అందుక్కారణం. ఐతే ఇలా ఒకసారి వ్యతిరేకత వచ్చాక వేరే ప్రతికూల అంశం ఏది తెరపైకి వచ్చినా ట్రోల్ అవుతుంటారు సెలబ్రెటీలు. ఇప్పుడు రాజమౌళి పరిస్థితి ఇలాగే తయారైంది. ఆయన తాజాగా ట్విట్టర్లో ఫండ్ రైజింగ్ కోసం ఒక పోస్టు పెట్టాడు.
బాహుబలి సినిమా కోసం కోఆర్డినేటర్‌గా కీలక పాత్ర పోషించిన దేవిక అనే అమ్మాయి బ్లడ్ క్యాన్సర్ బారిన పడిందని.. ఆమె కోసం సాయం చేయాలని ఆయన పిలుపునిచ్చాడు. ఐతే తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా కోసం కీలకంగా వ్యవహరించిన వ్యక్తికి రాజమౌళి సొంతంగా సాయం చేయొచ్చు కదా.. దీనికి ఫండ్ రైజింగ్ దేనికి అంటూ నెటిజన్లు ఆయన మీద పడిపోయారు. అయినా రాజమౌళి సొంతంగా ఆమెకు ఎంత సాయం చేశారో చెప్పాలని కూడా ప్రశ్నించారు. ఇండియాలోనే వాటాల రూపంలో అత్యధిక పారితోషకం తీసుకునే దర్శకుడు సొంతంగా తన టీం మెంబర్ ఒకరికి ఆర్థిక సాయం చేసి ఆమె ప్రాణాలు కాపాడలేడా అంటూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇదంతా ఇంతకుమేందే జక్కన్నపై వచ్చిన నెగెటివిటీ ప్రభావం అని వేరే చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on January 29, 2022 8:34 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…