మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమాలో నటించనున్నారు. దీంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవే కాకుండా.. టైగర్ నాగేశ్వరావు సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు.
అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్న ఈ సినిమాను వంశీ కృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా కథ రవితేజకి బాగా నచ్చిందట. వీలైనంత త్వరగా సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నారని సమాచారం. అయితే కథ ప్రకారం.. ఇందులో ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటుందట. ఆ రోల్ కోసం నటి రేణుదేశాయ్ ను తీసుకోవాలని చూస్తున్నారు.
నిజానికి ఆమె నటిగా సినిమాలు చేసి చాలా కాలమవుతుంది.
ఈ మధ్యకాలంలో టీవీ షోలకు జడ్జిగా కనిపించింది. ఇదే సమయంలో ఆమెకి కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. ఇప్పుడు రవితేజ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ అంటూ దర్శకనిర్మాతలు ఆమెని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.
కానీ ఆమెని ఆన్ బోర్డ్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఆమె గనుక ప్రాజెక్ట్ లో భాగమైతే సినిమాకి మంచి హైప్ రావడం ఖాయం. ఇక ఈ సినిమాలో రవితేజ పక్క ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారని టాక్. అలానే కొందరు పేరున్న సెలబ్రిటీలను ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారు. ఇదిఒక పీరియాడిక్ డ్రామా. అరవైవ దశకంలో జరిగిన స్టోరీ. అయితే రవితేజను దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాబిన్ హుడ్ తరహాలో తీర్చిదిద్దాలని చూస్తున్నారు.
This post was last modified on January 29, 2022 12:40 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…