రెండేళ్ల క్రితం వరకు సూర్య సినిమా వస్తోందంటేనే అందరూ అనుమానంగా చూసేవారు. ఈసారైనా హిట్టు కొడతాడా లేదా అని సందేహపడేవారు. ఆ రేంజ్‌లో ఫెయిల్యూర్స్ వచ్చాయి మరి. అయితే ఆకాశమే నీ హద్దురా మూవీ చేసిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. రీసెంట్‌గా ‘జైభీమ్’ కూడా విజయ ఢంకా మోగించడంతో పాటు ఆస్కార్ బరిలో నిలవడంతో అతడి డిమాండ్ మరింత పెరిగిపోయింది.
దాంతో సినిమాల లైనప్ కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఎదర్కుమ్ తుణీందవన్ అనే మూవీలో నటిస్తున్నాడు సూర్య. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. సన్ పిక్చర్స్ సంస్థ ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తోంది. గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాల ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో. దీని తర్వాత వెట్రిమారన్ డైరెక్షన్‌లో ‘వాడి వాసల్’ చిత్రంలోనూ యాక్ట్ చేయనున్నాడు సూర్య.
ఈ మూవీని ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. పాండిరాజ్ మూవీ రిలీజయ్యాక ఈ మూవీ సెట్స్‌కి వెళ్లనుంది. ఇంతలోనే మరో ఇద్దరు దర్శకుల్ని కూడా లైన్‌లో పెట్టేశాడు సూర్య. వాళ్లెవరో కాదు.. సుధ కొంగర, శివ. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సూర్యకి ఆకాశమే నీ హద్దురా చిత్రంతో చాలా మంచి హిట్ ఇచ్చింది సుధ.
అందుకే ఆమెతో మరో మూవీకి కమిటయ్యాడు సూర్య. ఇక కమర్షియల్ సినిమాలు తీయడంలో శివ సిద్ధహస్తుడు. వీరమ్, వేదాళం, వివేగం, విశ్వాసం అంటూ అజిత్‌కి చాలా పెద్ద హిట్లు ఇచ్చాడు. అందుకే తనతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇవి కాక నిర్మాతగానూ నాలుగైదు సినిమాలు పట్టాలెక్కించబోతున్నాడు. క్రేజీ లైనప్‌తో తన ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్నాడు.
This post was last modified on January 28, 2022 8:15 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…