Movie News

శ్రీవిష్ణు.. ఈ మెరుపులకేం కానీ

యువ కథానాయకుల్లో శ్రీ విష్ణు రూటే వేరు. అతను రొటీన్ సినిమాలు చేయడు. ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడు. మధ్య మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుున్నా తట్టుకుని తన దారిలోనే తాను ప్రయత్నిస్తూ వచ్చాడు. ఐతే ఈ మధ్య అతడి బ్రాండు దెబ్బ తింటూ వస్తోంది. బ్రోచేవారెవరురా తర్వాత అతడికి ఆశించిన ఫలితాలు దక్కట్లేదు.

తిప్పరా మీసం, గాలి సంపత్, అర్జున ఫల్గుణ డిజాస్టర్లు కాగా.. రాజ రాజ చోర కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాల ప్రోమోలు చూస్తే ఆహా ఓహో అన్నట్లు అనిపించాయి. కానీ ‘రాజ రాజ చోర’ మినహా చిత్రాలకు బొమ్మ పూర్తిగా తిరగబడిపోయింది. సినిమాల్లో అస్సలు విషయం లేక తుస్సుమనిపించాయి. దీంతో క్రమంగా శ్రీ విష్ణు పేరు దెబ్బ తింటోంది. ఈ నేపథ్యంలో కేవలం ప్రోమోలతో మెరుపులు మెరిపించడమే కాక సినిమాతోనూ సత్తా చాటాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు శ్రీ విష్ణు.

విష్ణు నుంచి త్వరలో రాబోతున్న కొత్త సినిమా.. భళా తందనాన. ఈ సారి కూడా వెరైటీ టైటిల్‌తో వస్తున్నాడు విష్ణు. ఇంతకుముందు బాణం, బసంతి సినిమాలు రూపొందించిన చైతన్య దంతులూరి ఈ సినిమాను రూపొందించాడు. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి.. మధ్యలో వరుస ఫ్లాపులతో వెనక్కి తగ్గిన సీనియర్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. పెట్రేగిపోతున్న రాజకీయ నాయకులపై మారు వేషం వేసుకుని పోరాడే కుర్రాడి పాత్రలో శ్రీవిష్ణు కనిపించబోతున్నాడు. చాలాసార్లు చూసిన కథలా అనిపించినా.. ట్రీట్మెంట్ కొత్తగా అనిపిస్తోంది. టీజర్లో డైలాగులు బాగానే పేలాయి. విష్ణు సినిమాకు తొలిసారి కొంచెం మాస్ టచ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. స్టార్ హీరోలు చేయాల్సిన కథలో అతను చేసినట్లున్నాడు. కాకపోతే ఇలా ప్రోమోలతో సరిపెట్టకుండా సినిమాలోనూ మెరుపులుంటే బాగుంటుంది. ఈసారైనా విష్ణు అంచనాలను అందుకుని మంచి సినిమాను అందిస్తాడేమో చూడాలి. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on January 28, 2022 1:25 pm

Share

Recent Posts

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

37 minutes ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

2 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

5 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

5 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

5 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

6 hours ago