బాక్సాఫీస్‌కు ఏమాత్రం అనుకూలం కాని పరిస్థితులున్నాయిప్పుడు. థియేటర్లు తెరిచి ఉన్నాయన్న మాటే కానీ.. జనాలు మాత్రం రావట్లేదు. అందుకు కరోనా ఒక ముఖ్య కారణం కాగా.. సరైన సినిమాలు లేకపోవడం ఇంకో కారణం. వైరస్ ప్రభావం పెరిగిపోయి దాదాపు ప్రతి ఇంట్లోనూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూసే పరిస్థితి ఎక్కడుంటుంది? మిగతా పనుల కోసం ఎక్కడికి కావాలంటే అక్కడికి జనాలు తిరిగేస్తున్నారు కానీ.. సినిమాలు చూసే మూడ్‌లో అయితే కనిపించడం లేదు.
పెద్ద స్టార్ల సినిమాలుంటే ఏమీ చూడకుండా థియేటర్లకు వెళ్లిపోతారు కానీ.. మామూలు, చిన్న సినిమాల కోసం అయితే ఇప్పుడు ఎగబడే పరిస్థితి లేదు. చిన్న సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వెళ్లాలంటే.. ఆ సినిమా సూపర్ అన్న టాక్ రావాలి. ఇప్పుడు అలాంటి టాక్ కోసమే చూస్తోంది కీర్తి సురేష్ కొత్త సినిమా ‘గుడ్ లక్ సఖి’.ఎప్పుడో సినిమా రెడీ అయినా సరైన టైమింగ్ కుదరక వాయిదాల మీద వాయిదాలు పడ్డ ‘గుడ్ లక్ సఖి’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇది ఒకరకంగా ఎదురీతే అని చెప్పాలి. ఈ టైంలో థియేటర్లు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నా సినిమాల విడుదలకు నిర్మాతలు ఉత్సాహం చూపట్లేదు. కానీ ‘గుడ్ లక్ సఖి’ టీం ధైర్యం చేసింది. సినిమా మీద ఉన్న నమ్మకం వల్లా లేక ఇలా సోలోగా రిలీజయ్యే అవకాశం మళ్లీ రాదనో తెలియదు మరి. ఏదేమైనప్పటికీ బాక్సాఫీస్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పరిస్థితుల్లో రిలీజవుతున్న ‘గుడ్ లక్ సఖి’ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో చూడాాలి.
ఇలాంటి పరిస్థితుల్లో సినిమా హిట్టయితే మాత్రం గొప్ప అనుకోవాలి. ‘మహానటి’ తర్వాత తనపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయిన కీర్తి.. ఈ సినిమాతో తనేంటో రుజువు చేసుకోవడం కీలకం. హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్ సహా కొన్ని మంచి సినిమాలు తీసిన అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. జగపతిబాబు, ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్రలు పోషించారు.
This post was last modified on January 28, 2022 12:34 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…