కాస్త పేరున్న ఏ హీరోయిన్ అయినా ఏదో ఒక దశలో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించక తప్పట్లేదు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందా.. మీకు ఏవైనా అలాంటి ఇబ్బందికర అనుభవాలున్నాయా అన్న ప్రశ్నలు మీడియా వాళ్ల నుంచి రాక మానవు. ఈ ప్రశ్నలకు ఒక్కో హీరోయిన్ ఒక్కోలా స్పందిస్తుంటుంది. తాజాగా నటి తేజస్వి కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడింది.
ముంబయి హీరోయిన్ల మీద ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమలో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని, కమిట్‌మెంట్ పేరుతో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్లను లైంగికంగా లొంగదీసుకుంటున్నారని.. వాళ్ళు చెప్పిన కమిట్‌మెంట్లకు ఓకే చెబితేనే అవకాశాలు ఇస్తారని తేజస్వి కుండబద్దలు కొట్టేసింది. తనను ఎంతోమంది నేరుగా కమిట్‌మెంట్ ఇస్తావా అని అడిగినట్లు తేజస్వి వెల్లడించింది.
అసలు ఇండస్ట్రీలో అడుగు పెట్టగానే ముందు కమిట్మెంట్ కోసం అడిగేవాళ్లే కనిపిస్తారని.. వాళ్లందరినీ దాటి వెళ్తేనే అసలైన సినిమా వాళ్లు కనిపిస్తారన్న తేజస్వి.. ముంబయి హీరోయిన్ల వల్ల మన అమ్మాయిలకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ముంబయి హీరోయిన్లు అన్నింటికీ సిద్ధంగా ఉంటారు కాబట్టే వారికే అవకాశాలు ఇస్తున్నారని.. అవకాశాల కోసం పడక సుఖం ఇవ్వాలని వాళ్లకు ముందే తెలుసని, వాళ్లు ప్రిపేరయ్యే ఇక్కడికి వస్తారని.. అలాంటి వాళ్ల వల్లే తెలుగు హీరోయిన్కిలకు చెడ్డపేరు వస్తోందని తేజస్వి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇండస్ట్రీలో తనకు తెలిసిన హీరోయిన్లు చాలామందికి కాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయని.. చాలామంది సిగ్గుపడి బయటకు చెప్పడం లేదని.. కాస్టింగ్ కౌచ్ వల్ల తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని తేజస్వి చెప్పింది. గతంలో ఓ అబ్బాయితో డేటింగ్ చేశానని, అతడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యాక ఈ కాస్టింగ్ కౌచ్ అంశం వల్లే ఆ బంధం చెడిపోయిందని తేజస్వి ఆవేదన వ్యక్తం చేసింది.
This post was last modified on June 13, 2020 2:31 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…