అక్కినేని నాగచైతన్య-సమంతల విడాకుల గురించి ఆరు నెలల ముందు ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక రెండు నెలల పాటు దీని గురించి ఎంతో చర్చ జరిగాక తమ వివాహ నాలుగో వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ జంట విడాకుల గురించి అధికారికంగా ప్రకటించి అందరికీ పెద్ద షాకిచ్చింది. అప్పటిదాకా చైతూ, సమంత విడిపోతారా లేదా అన్న దాని మీదే చర్చ నడవగా.. అప్పట్నుంచి వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు.. ఇద్దరిలో ఎవరు విడాకుల ప్రతిపాదన తెచ్చారు అనే దాని మీద డిస్కషన్ సాగింది.
ఈ విషయంలో తానే బాధితురాలిని అన్నట్లుగా సమంత సోషల్ మీడియా పోస్టులు పెట్టడం చూసి అందరూ.. చైతూనే విలన్‌గా చూడటం మొదలుపెట్టారు. అతనే సమంత నుంచి బలవంతంగా విడిపోయాడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో ట్విస్ట్ వచ్చింది. విడాకులు కోరింత సమంతే అని.. చైతూ అందుకు సరే అన్నాడని నాగార్జున చెప్పి అందరినీ అయోమయంలో పడేశాడు.చాలామంది సెలబ్రెటీల్లాగే నాగ్ కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలను, కామెంట్లను తాను అస్సలు పట్టించుకోనని అంటుంటాడు కానీ.. అందులో చైతూపై నెగెటివిటీ చూశాకే ఆయన స్పందించినట్లు కనిపిస్తోంది.
సమంతతో విడిపోయే విషయంలో అందరూ తన కొడుకును విలన్‌గా చూస్తుండటంతోనే నాగ్ ఇలా మాట్లాడి ఉండొచ్చనిపిస్తోంది. ఐతే విడాకుల విషయంలో చైతూ తప్పేం లేదన్నట్లుగా మాట్లాడటంతో ఇప్పుడు అందరూ సమంత వైపు చూస్తున్నారు. దీనిపై ఆమె స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బేసిగ్గా చైతూ రిజర్వ్డ్. అతను దేనికీ స్పందించడు. సమంత దానికి పూర్తి రివర్స్. విడాకులు, తదనంతర పరిణామాలపై పరోక్ష పోస్టుల ద్వారా.. అలాగే బహిరంగ వేదికల్లో ఆమె ఇప్పటికే చాలా మాట్లాడింది.
ఇప్పుడు నాగ్ నింద తనపైకి తోసేసిన నేపథ్యంలో సమంత ఊరుకుని ఉంటుందని అనుకోలేం. ఆమె నుంచి గట్టి స్పందనే ఉండొచ్చు. విడాకులు అడిగింది నిజమే అయితే.. ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నానో వెల్లడించకుండా పోదు. అది క్రిప్టిక్ పోస్టుల ద్వారా కావచ్చు.. లేదా స్ట్రెయిట్‌గానే కావచ్చు. ఇప్పుడు కాకపోతే తర్వాత మీడియా వాళ్లను కలిసినపుడు దీనిపై ప్రశ్న ఎదురు కాకుండా పోదు. సమంత స్పందించకపోదు. మరి నాగ్ మాటకు ఆమె బదులేంటో?
This post was last modified on January 27, 2022 7:23 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…