అల్లు కాంపౌండ్ లో అందరూ తమ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ‘పుష్ప’ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పార్ట్ 2 కోసం సిద్ధమవుతున్నారు. అల్లు అరవింద్ అటు సినిమాల నిర్మాణం, ఇటు ‘ఆహా’ పనులతో చాలా బిజీ. అల్లు బాబీ కూడా నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నారు. ఆయన నిర్మించిన ‘గని’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు సిరీస్ కొత్త సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది. అందులో మరో హీరో కూడా ఉన్నాడని సమాచారం. అతడు మరెవరో కాదు.. నటుడు శ్రీవిష్ణు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతోంది. అయితే దీనికి డైరెక్టర్ ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ సినిమా మాత్రం ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
శ్రీవిష్ణు గతంలో కూడా ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేశారు. అలానే సోలో హీరోగా కూడా చేస్తున్నారు. కానీ అల్లు శిరీష్ తొలిసారి వేరే హీరోతో కలిసి నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాతోనైనా.. సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘ప్రేమ కాదంట’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈపాటికే విడుదల కావాల్సింది కానీ ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ సినిమాకి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఇందులో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పడిందని.. సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on January 27, 2022 5:13 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…