కొత్త సినిమా.. ఒక పథ‌కం ప్ర‌కారం

హీరోగా నిల‌దొక్కుకోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేసి అవేవీ ఫ‌లించ‌క కొన్నేళ్లుగా సైలెంటుగా ఉన్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌మ్ముడు సాయిరాం శంక‌ర్. త‌న‌ అన్నయ్య ద‌ర్శ‌క‌త్వంలో 143 సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన అత‌డికి బంప‌ర్ ఆఫ‌ర్ మిన‌హాయిస్తే హిట్టు లేదు. చివ‌ర‌గా అత‌ను న‌టించిన చిత్రాలు విడుద‌లైన సంగతి కూడా తెలియ‌కుండా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయాయి. గ‌త కొన్నేళ్ల నుంచి సాయిరాం పేరే ఇండ‌స్ట్రీలో వినిపించ‌ట్లేదు.

దాదాపుగా అత‌డి కెరీర్ ముగిసిన‌ట్లే క‌నిపించింది. ఐతే ఇప్పుడో భారీ సినిమాతో సాయిరాం శంక‌ర్ రీఎంట్రీ ఇవ్వ‌బోతుండ‌టం విశేషం. ఆ సినిమాకు తాజాగా టైటిల్ రివీల్ చేశారు. ఒక ప‌థ‌కం ప్ర‌కారం.. ఇదీ సాయిరాం కొత్త సినిమా టైటిల్. పేరు మాత్ర‌మే కాదు.. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సాయిరాం శంక‌ర్ ర‌క‌ర‌కాల అవ‌తారాల్లో క‌నిపిస్తూ ఆస‌క్తి రేకెత్తిస్తున్నాడు ఫ‌స్ట్ లుక్‌లో.

ఈ పోస్ట‌ర్ గ‌మ‌నిస్తే వేర్వేరు కాలాల్లో సాగే సినిమాలాగా క‌నిపిస్తోంది. మ‌ల‌యాళంలో మంచి పేరున్న వినోద్ విజ‌యన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌డం విశేషం. అత‌ను నిర్మాత‌ల్లో ఒక‌డు కూడా. రాజీవ్ ర‌వి లాంటి ఫేమ‌స్ కెమెరామ‌న్ ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌గా.. ఓ మై ఫ్రెండ్ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు రాహుల్ రాజ్ సంగీతం అందించాడు.

మ‌రో పేరున్న మ్యూజిక్ కంపోజ‌ర్ గోపీ సుంద‌ర్ నేప‌థ్య సంగీతం స‌మ‌కూర్చాడు. మొత్తంగా చూస్తే ఇది పెద్ద స్థాయి సినిమాలాగే క‌నిపిస్తోంది. పూర్తిగా మార్కెట్  కోల్పోయి, లైమ్ లైట్లో లేకుండా పోయిన హీరోను పెట్టి మంచి బ‌డ్జెట్లో, పేరున్న టెక్నీషియ‌న్ల‌తో ఇలాంటి సినిమాను రూపొందించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఈ చిత్రంతో అయినా సాయిరాం బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. దీంతో పాటుగా అత‌ను రీసౌండ్ అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తున్నాడు.