త్రివిక్రమ్ కి పాన్ ఇండియా ఆలోచన లేదా..?

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ అందరూ కూడా పాన్ ఇండియా దర్శకులుగా మారిపోతున్నారు. రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాధ్, సుజీత్, రాధాకృష్ణ ఇలా చాలా మంది తెలుగు దర్శకులు పాన్ ఇండియా దర్శకులుగా మారిపోతున్నారు. త్వరలోనే కొరటాల శివ కూడా ఈ లిస్ట్ లో చేరతారని సమాచారం.

యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కూడా తన ‘శ్యామ్ సింగారాయ్’ సినిమా ఇతర భాషల్లో విడుదల చేసి పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేశారు. కానీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేకపోయారు. సౌత్ కి పరిమితమయ్యే కథలను మాత్రమే ఎన్నుకుంటున్నారాయన.

అతడి లాస్ట్ సినిమా ‘అల వైకుంఠపురములో’ కూడా పెద్ద హిట్ అయింది కానీ ఈ సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో పాటలు మాత్రం నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యాయి. ‘పుష్ప’ సినిమా తరువాత అల్లు అర్జున్ పాత సినిమాలన్నీ హిందీలో డబ్ అవుతున్నాయి. 
‘అల.. వైకుంఠపురములో’ సినిమాను కూడా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తుండడంతో డబ్బింగ్ ప్లాన్స్ ఆగిపోయాయి.

ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు త్రివిక్రమ్. అది కూడా పాన్ ఇండియా సినిమా కాదు. ఇంకెప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమాలు తీస్తారనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. 
కానీ త్రివిక్రమ్ తీరు చూస్తుంటే మాత్రం ఆయన తెలుగు సినిమాలకే పరిమితమయ్యేలా కనిపిస్తున్నారు. పైగా ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పట్లో పాన్ ఇండియా ఆలోచన చేసే అవకాశం లేదంటున్నారు.