మిగతా భాషలతో పోలిస్తే క్రీడల నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ జానర్ మీద మన దర్శకులకు పట్టు అంతంతమాత్రమే. ప్రపంచ స్థాయిలో అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామాలు వస్తుంటాయి. బాలీవుడ్లో కూడా ఈ జానర్ మీద దర్శకులు బాగానే పట్టు సంపాదించారు. అక్కడ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతమైన సినిమాలు వచ్చాయి.
కానీ మన దగ్గర ‘జెర్సీ’ మినహాయిస్తే మంచి విజయం సాధించి అథెంటిక్ స్పోర్ట్స్ డ్రామా ఒక్కటీ కనిపించదు. ‘జెర్సీ’ కూడా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి ఎక్కువమందికి కనెక్టయింది. వేరే క్రీడల నేపథ్యంలో ఇలా అలరించిన సినిమాలు దాదాపు కనిపించవు. ఐతే ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్‌లో ఎవ్వరూ టచ్ చేయని ఆర్చరీ నేపథ్యంలో తెలుగులో అటు ఇటుగా ఒకే సమయంలో రెండు సినిమాలు తెరకెక్కడం విశేషం.
అందులో ఒకటి ‘లక్ష్య’ కాగా.. మరొకటి ‘గుడ్ లక్ సఖి’.ఇందులో మొదట అనౌన్స్ అయింది, పూర్తయింది ‘గుడ్ లక్ సఖి’నే అయినప్పటికీ.. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. దాని కంటే ముందు ‘లక్ష్య’నే రిలీజైంది. అందులో నాగశౌర్య హీరో కాగా.. మధ్యలో ఆటకు దూరమైన అతణ్ని మోటివేట్ చేసి లక్ష్యం దిశగా నడిపించే ఆర్చరీ కోచ్‌గా జగపతిబాబు నటించాడు. ఈ సినిమాలో ఆ పాత్ర ద్వితీయార్ధంలో వస్తుంది. కానీ ఈ సినిమా కానీ.. జగపతిబాబు పాత్ర కానీ అంతగా ఆకట్టుకోలేదు. ‘లక్ష్య’ బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ఈ సినిమా బాగుండి హిట్టయితే ‘గుడ్ లక్ సఖి’కి చాలా ఇబ్బంది అయ్యేది. ‘లక్ష్య’ రేసులోకి రావడం వల్లే ‘గుడ్ లక్ సఖి’ రిలీజ్ కూడా వెనక్కి జరపాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘గుడ్ లక్ సఖి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా బాగానే అనిపిస్తోంది. ఐతే చిత్రమైన విషయం ఏంటంటే.. ‘గుడ్ లక్ సఖి’లోనూ జగపతిబాబు ఆర్చరీ కోచ్ పాత్రనే చేయడం విశేషం. కాకపోతే ‘లక్ష్య’లో మాదిరి ఆ పాత్ర కామెడీగా అనిపించట్లేదు. సీరియస్‌గా ఉంది. ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. మరి ‘లక్ష్య’కు మైనస్ అయిన జగపతి.. ‘గుడ్ లక్ సఖి’కి ప్లస్ అయి ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందేమో చూడాలి.
This post was last modified on January 24, 2022 8:14 pm
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…