భారతీయ హిందువులకు అత్యంత ఇష్టమైన పురాణ గాథలు మహాభారతం, రామాయణం మీద ఇప్పటికే వివిధ భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. సీరియళ్లు కూడా తీశారు. కానీ గత కొన్నేళ్లలో టెక్నాలజీ విస్తృతి పెరిగి తెరపై అద్భుతాలు ఆవిష్కృతమవుతున్న నేపథ్యంలో ఈ గాథల్ని మరింత గొప్పగా తీర్చిదిద్ది ప్రేక్షకులకు అందించాలన్న సంకల్పంతో ఫిలిం మేకర్స్ ఉన్నారు. మహాభారతంపై రెండు మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. అందులో రాజమౌళి చేయాలనుకున్న మెగా ప్రాజెక్టు కూడా ఒకటి.
కాకపోతే అది పట్టాలెక్కడానికి టైం పట్టొచ్చు. ఇంకోవైపు రామాయణం మీద ఒక మెగా మూవీ గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. తెలుగువాడైన బాలీవుడ్ నిర్మాత మధు మంతెన.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌తో కలిసి ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి కొన్నేళ్లవుతోంది. దంగల్ దర్శకుడు నితీశ్ తివారి ఈ సినిమాను తెరకెక్కించాల్సి ఉంది.కొన్నేళ్ల నుంచి స్క్రిప్టు తయారీ, ప్రి ప్రొడక్షన్ పనుల్లోనే మునిగి ఉన్న చిత్ర బృందం.. నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేయలేదు. ఐతే ఇంకెంతమాత్రం ఆలస్యం చేయకుండా పని అవగొట్టేయాలని చూస్తున్నట్లు సమాచారం.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ఈ చిత్రంలో రాముడిగా చూపించాలన్నది మేకర్స్ కోరిక. రాముడి పాత్రకు మహేష్ పర్ఫెక్ట్‌గా సూటవుతాడని భావిస్తున్నారు. మహేష్ వల్ల సౌత్‌లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని.. మిగతా కీలక పాత్రలకు బాలీవుడ్ ఆర్టిస్టులను పెట్టి పాన్ ఇండియా లెవెల్లో దీనికి క్రేజ్ తీసుకురావాలని అనుకున్నారు. కానీ మహేష్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. వేరే కమిట్మెంట్లకు తోడు.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అయోమయమే అందుక్కారణం.
అందులోనూ రాజమౌళి సినిమా లైన్లో ఉన్న నేపథ్యంలో దానికి ఇబ్బంది రానివ్వకూడదన్నది అతడి ఉద్దేశం. ఈ నేపథ్యంలో ‘రామాయణం’పై మహేష్ విముఖతతోనే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మధు మంతెన, అరవింద్ మహేష్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఐతే మహేష్ నిక్కచ్చిగా ఈ సినిమా చేయనని చెప్పేస్తే.. సెకండ్ ఆప్షన్‌గా రణబీర్ కపూర్‌ను పెట్టుకున్నారు. అతడికి కూడా కమిట్మెంట్లు చాలానే ఉన్నాయి. బ్రహ్మాస్త్ర, అనిమల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతణ్ని ఈ సినిమాకు ఒప్పిస్తే.. రావణుడిగా దక్షిణాది నుంచి పేరున్న నటుడిని పెట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on January 24, 2022 5:41 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…