కరోనా విజృంభిస్తుండగా.. సినిమాలు అంతంతమాత్రం ఆడుతున్న టైంలో రికార్డులేంటి అనిపిస్తోందా? ఇది గొప్పగా చెప్పుకునే రికార్డు కాదు. మరిచిపోదగ్గ రికార్డు. సంక్రాంతి తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ సీజన్ అన్న సంగతి తెలిసిందే. ఈ టైంలో ఓ మోస్తరు స్థాయి సినిమాలు కూడా ఘనవిజయం సాధిస్తుంటాయి. ఇక ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందంటే వసూళ్ల మోతే. కానీ ఈసారి మాత్రం ఈ పండక్కి బాక్సాఫీస్ డల్లుగా మారింది.
కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోగా.. బంగార్రాజు లాంటి మీడియం రేంజ్ మూవీ.. రౌడీ బాయ్స్, హీరో లాంటి చిన్న సినిమాలు మాత్రమే పండుగ బరిలో నిలిచాయి. వీటిలో దేనికీ సరైన టాక్ రాలేదు. ఉన్నంతలో ‘బంగార్రాజు’కు టాక్, వసూళ్లు పర్వాలేదు. ఆరంభం బాగున్నా తర్వాత ‘బంగార్రాజు’ సైతం ట్రాక్ తప్పింది. చివరికి చూస్తే నిఖార్సయిన హిట్ లేని అరుదైన సంక్రాంతిగా 2022 సీజన్ నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.
కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే ‘బంగార్రాజు’ హిట్ అని చెప్పాలి. తొలి వారంలో ఈ చిత్రం ఆంధ్రా, రాయలసీమ కలిపి దాదాపు 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కానీ తెలంగాణలో చూస్తే ఫస్ట్ వీక్ షేర్ రూ.6 కోట్లు మాత్రమే. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.40 కోట్ల దాకా పలికాయి. పది రోజుల్లో ఈ సినిమా రూ.32 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఆంధ్రా, రాయలసీమల్లో ఈ సినిమా సెకండ్ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ మార్కును టచ్ చేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా లాభాలు ఆశించే పరిస్థితి లేదు. ఇప్పుడు సినిమాల ప్రదర్శనకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు.
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయి..దాదాపు ప్రతి కుటుంబం ప్రభావితమవుతున్న పరిస్థితుల్లో జనాలకు సినిమాలు చూసే మూడ్ ఎక్కడ ఉంటుంది? కాబట్టి ‘బంగార్రాజు’ థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే. మిగతా రెండు సంక్రాంతి సినిమాల కథ ఆల్రెడీ ముగిసింది. తెలంగాణ, ఓవర్సీస్, ఇతర ఏరియాల్లో ‘బంగార్రాజు’ ఫ్లాప్ అనే చెప్పాలి. ఓవరాల్‌గా చూసినా దీని రికవరీ 80 శాతమే ఉంది. కాబట్టి ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ హిట్‌గా చెప్పలేం. ఇలా చూస్తే హిట్ లేని సంక్రాంతిగా అరుదైన జాబితాలో 2022 సీజన్చ చేరుతున్నట్లే. 2018లో అజ్ఞాతవాసి డిజాస్టర్ కాగా.. గ్యాంగ్, రంగులరాట్నం సినిమాలు కూడా తుస్సుమనిపించాయి. అప్పుడు ‘జై సింహా’ యావరేజ్ టాక్‌తోనే ఓ మోస్తరుగా ఆడి సక్సెస్ అనిపించుకుంది. గత దశాబ్ద కాలంలో 2018 సంక్రాంతినే నిరాశాజనకంగా చూసేవాల్లం. కానీ ఈ సంక్రాంతి దాని కంటే నిరాశను మిగిల్చింది.
This post was last modified on January 24, 2022 2:46 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…