ముంబై ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకి ఒకట్రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు వర్కవుట్ అవ్వకపోవడంతో డీలా పడింది ఈ బ్యూటీ. కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కాలం గడిపేసింది.
ఫైనల్ గా ‘అఖండ’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
ఇందులో ఆమె ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ప్రగ్యా ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ సినిమా విడుదలై రెండు నెలలు కావొస్తుంది. కానీ ఇప్పటివరకు ప్రగ్యా మరో సినిమా సైన్ చేయలేదు. సాధారణంగా ఒక హిట్ పడితేనే హీరోయిన్ల ఫేట్ మారిపోతుంది కానీ ప్రగ్యా విషయంలో అలా జరగడం లేదు.
‘అఖండ’ హిట్ తరువాత ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఇంత పెద్ద హిట్ కొట్టాక తాను కోటి ఎందుకు తీసుకోకూడదని భావిస్తోంది ప్రగ్యా. కానీ అంత రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు కూడా ఉండాలి కదా.. రీసెంట్ గా ఇద్దరు సీనియర్ హీరోల సరసన ఆమెకు ఆఫర్లు వచ్చినా.. కోటికి తగ్గదేలేదని పట్టుబట్టిందట.
ఆ కారణంగానే ఇప్పటివరకు ప్రగ్యా నుంచి మరో సినిమా అనౌన్స్మెంట్ రాలేదు. ఆమె డిమాండ్లకు ఒప్పుకొని అవకాశాలు ఇచ్చేవారెవరైనా వస్తే కానీ ఆమె కొత్త సినిమా చేసేలా లేదు. అప్పటివరకు ఖాళీగానే ఉంటుందేమో. కోటి రెమ్యునరేషన్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లనే తీసుకోవచ్చనేది నిర్మాతల ఆలోచన. మరి ప్రగ్యా రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడుతుందేమో చూడాలి!
This post was last modified on January 23, 2022 8:12 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…