ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘జెంటిల్ మ్యాన్’ ఒకటి. పేరుకిది తమిళ చిత్రం అయినా.. ఇండియా మొత్తం దీని గురించి మాట్లాడుకున్నారు అప్పట్లో. లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాతోనే అరంగేట్రం చేశాడు. తమిళంలో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయింది. తెలుగులోనూ ఇదే పేరుతో అనువాదమై ఇక్కడా ఘనవిజయం సాధించింది. తర్వాత హిందీలో చిరంజీవి హీరోగా దీన్ని రీమేక్ చేస్తే అక్కడ సక్సెస్ అయింది.
కమర్షియాలిటీ, కొత్తదనం, సామాజిక అంశాలు.. ఈ మూడూ ఒకే సినిమాలో పెట్టడం చాలా కష్టం అనుకునే రోజుల్లో శంకర్ ‘జెంటిల్‌మ్యాన్’ను ఈ మూడు విషయాల్లోనూ ఉన్నతంగా నిలబెట్టి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఒక రకంగా ఈ విషయంలో శంకర్ ట్రెండ్ సెట్ చేశాడనే చెప్పాలి. తర్వాత మురుగదాస్ సహా చాలామంది దర్శకులు ఆయన్ని అనుసరించారు. ఈ ట్రెండ్ సెట్టింగ్ మూవీకి మూడు దశాబ్దాల తర్వాత సీక్వెల్ రాబోతోంది.
కాకపోతే ‘జెంటిల్ మ్యాన్-2’ను శంకర్ డైరెక్ట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. హీరోగా కూడా అర్జున్ నటించకపోవచ్చు. ఇంకా దర్శకుడు, హీరో సంగతేమీ తేలలేదు కానీ.. సినిమా మాత్రం అనౌన్స్ చేశాడు నిర్మాత కేటీ కుంజుమోన్. ఈయన 90వ దశకంలో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. శంకర్‌ను ‘జెంటిల్ మ్యాన్’తో దర్శకుడిగా పరిచయం చేసింది ఆయనే. కొత్త దర్శకుడిని నమ్మి భారీ బడ్జెట్ పెట్టి గొప్ప ఫలితాన్నందుకున్నాడాయన.
ఆ తర్వాత ప్రేమికుడు, ప్రేమదేశం, ప్రేమికుల రోజు, రక్షకుడు లాంటి భారీ చిత్రాలను ఆయన నిర్మించారు. ఐతే ‘రక్షకుడు’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న ఆయన.. కొన్నేళ్లకు సినిమాలే మానేశారు. రెండు దశాబ్దాలుగా చప్పుడు లేని కుంజుమోన్.. ఇప్పుడు ‘జెంటిల్‌మ్యాన్-2’తో వార్తల్లోకి వచ్చాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణిని ఆయన ఎంచుకోవడం విశేషం. కీరవాణిని కలిసి ఆయన్ని సత్కరిస్తున్న ఫొటోతో ‘జెంటిల్ మ్యాన్-2’ సినిమాను అనౌన్స్ చేశాడు కుంజుమోన్. మరి ఈ సీక్వెల్లో హీరో ఎవరో.. దాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 2:29 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…