బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. ‘జబర్దస్త్’, ‘ఢీ’ వంటి షోలకు ఆమె యాంకరింగ్ చేస్తుంటారు. అలానే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తుంటారు. త్వరలోనే ఆమె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించనుందని టాక్. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రష్మీ గౌతమ్ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
అదేంటంటే.. రష్మీ గౌతమ్ లాక్ డౌన్ లో రహస్యంగా పెళ్లి చేసుకుందట. నిజానికి చాలా కాలంగా సుధీర్ తో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరూ మాత్రం తమ మధ్య స్నేహం తప్ప వేరేమీ లేదని చెబుతూ వచ్చారు. ఇప్పుడు రష్మీ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందట. అయితే ఆ విషయాన్ని ఆమె ఎందుకు సీక్రెట్ గా ఉంచుతుందనే విషయం మాత్రం తెలియడం లేదు.
లాక్ డౌన్ లో చాలా మంది తారలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. కానీ రష్మీ మాత్రం తన పెళ్లి విషయాన్ని బయటపెట్టాలనుకోవడం లేదు. అవకాశాలు తగ్గుతాయని ఆమె భావిస్తుందేమోననే సందేహాలు కలుగుతున్నాయి. అలా చూసుకుంటే అనసూయకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా.. ఆమెకి బుల్లితెరపై, వెండితెరపై అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
ఒకప్పటిలా పెళ్లయితే అవకాశాలు పోతాయనే పరిస్థితి ఇప్పుడు లేదు. మరి ఈ విషయంలో రష్మీ ఏం ఆలోచిస్తుందేమో ఆమెకే తెలియాలి. కానీ ఆమెకి పెళ్లి జరిగిందనే విషయం మాత్రం పక్కా అని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి తన భర్తను ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి!
This post was last modified on January 22, 2022 1:11 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…