ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. కేవలం గ్రాఫిక్స్ తో వెండితెరపై అద్భుతాలను సృష్టించొచ్చని నిరూపించాయి కొన్ని సినిమాలు. హాలీవుడ్ లో చాలా వరకు సినిమాలన్నీ గ్రాఫిక్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. గ్రాఫిక్స్ కోసం బాగా ఖర్చుపెడుతున్నారు.
ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాలో కూడా సీజీ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుందట. అదే కాకుండా.. ఇప్పుడు ప్రభాస్, పూజా లేకుండా ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా గ్రాఫిక్స్ సహాయంతో పూర్తి చేసినట్లు సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో శృంగారభరితమైన ఓ పాట ఉందట. ఆ సాంగ్ ను తెరకెక్కించడానికి పూజాహెగ్డే కాల్షీట్స్ అందుబాటులో లేవు.
పైగా అలాంటి పాటల్లో నటించాలంటే ప్రభాస్ కి బోలెడంత సిగ్గు. అందుకు చిత్రబృందం వీఎఫ్ఎక్స్ సహాయంతో ఈ సాంగ్ ను పూర్తి చేసేసిందట. ప్రభాస్, పూజా హెగ్డే డూప్ లతో పాటను కానిచ్చేశారని తెలుస్తోంది. క్లోజప్ షాట్స్ లో మాత్రం పూజా, ప్రభాస్ ల ముఖాలే కనిపిస్తాయని సమాచారం. ఇదంతా కూడా వీఎఫ్ఎక్స్ సాయంతో చేసినట్లు తెలుస్తోంది.
‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ ను ఇలా హీరో, హీరోయిన్లు లేకుండా తీశారంటే సాహసమనే చెప్పాలి. మరి తెరపై ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
This post was last modified on January 21, 2022 9:26 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…