ఈ మధ్యకాలంలో పెద్ద బ్యానర్లు సైతం చిన్న సినిమాలను నిర్మిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ.. భారీ లాభాలను పొందుతున్నారు నిర్మాతలు. గతేడాది వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వనీదత్ ‘జాతిరత్నాలు’ అనే చిన్న సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరో చిన్న సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందులో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించబోతున్నాడట.
స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది. త్వరలోనే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాతో పాటు రోషన్ మరో సినిమా లైన్ లో పెట్టారు. అది కూడా పెద్ద బ్యానర్ లో కావడం విశేషం. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ రోషన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయి.
‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన రోషన్ ఇటీవల ‘పెళ్లి సందడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం లాభాలు వచ్చాయి. దసరా సీజన్ లో సినిమాను విడుదల చేయడం నిర్మాతలకు బాగా కలిసొచ్చింది.
పైగా సినిమాలో రోషన్ పెర్ఫార్మన్స్ కు, డాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. సరైన కథలు పడితే రోషన్ నటుడిగా ఎదగడం ఖాయం. అందుకే వైజయంతీ మూవీస్ ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి రోషన్ ను లాక్ చేసింది. ముందు ఈ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తారని తెలుస్తోంది!
This post was last modified on January 21, 2022 5:01 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…