ఎక్కడైనా సరే సక్సెస్‌కు ఉన్న విలువ వేరు. సినీ పరిశ్రమలో దానికున్న విలువ మరింత ఎక్కువ. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. కాబట్టే సినిమా ఫలితాన్ని బట్టి రాత్రికి రాత్రి జీవితాలు మారిపోతుంటాయి. సినిమా సక్సెస్ అయితే దానికి మూల కారకుడైన దర్శకుడి చుట్టూ క్యూ కట్టేస్తారు. ఫెయిలైతే ప్రతికూల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనేది కూడా దర్శకుడే.
నిన్నుకోరి, మజిలీ సినిమాలతో వరుసగా రెండు విజయాలందుకుని టాలీవుడ్లో మంచి డిమాండే తెచ్చుకున్నాడు యువ దర్శకుడు శివ నిర్వాణ. కానీ అతడి మూడో సినిమా టక్ జగదీష్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేట్రికల్ రిలీజ్ లేకపోవడంతో వల్ల దీని ఫెయిల్యూర్ స్థాయిని అంచనా వేయలేకపోవచ్చు కానీ.. ఈ సినిమా ప్రేక్షకులను సంతృప్తి పరచలేదన్నది మాత్రం వాస్తవం.
ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా విషయంలో శివ ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. టక్ జగదీష్ సెట్స్ మీద ఉండగానే.. విజయ్ దేవరకొండతో తాను తర్వాతి సినిమా చేయబోతున్నట్లు శివ వెల్లడించడం తెలిసిందే. ఐతే ఈ సినిమా ఎంతకీ ముందుకు కదలడం లేదు. విజయ్ లైగర్ మూవీతో బిజీగా ఉన్న మాట వాస్తవమే అయినా.. ఈ సినిమాకు నిర్మాత ఖరారవ్వలేదు.
ప్రి ప్రొడక్షన్ జరుగుతున్న సంకేతాలేమీ కనిపించడం లేదు. కథా చర్చల కోసం విజయ్, శివ కలిసినట్లు కూడా ఏమీ వార్తలు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని, సీనియర్ హీరో వెంకటేష్‌తో శివ సినిమా తన కొత్త చిత్రం చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. దీని గురించి సోషల్ మీడియాలో ఒక పోస్టు కనిపిస్తే దానిపై శివ స్పందించాడు. అది అబద్ధపు వార్త అని కామెంట్ పెట్టాడు. ఐతే విజయ్‌తో సినిమా క్యాన్సిల్ అయిందన్నది అబద్ధమా.. లేక వెంకీతో సినిమా ఓకే అయిందన్నది అవాస్తవమా అన్నదే జనాలకు అర్థం కాలేదు. దీనిపై శివ కాస్త వివరణ ఇవ్వాల్సిందేమో.
This post was last modified on January 21, 2022 1:00 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…