Movie News

హిందీ ‘పుష్ప’.. నిర్మాతలకు దక్కిందేమీ లేదా?

‘పుష్ప’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడటంలో ఆశ్చర్యం లేదు. కేరళలో మంచి వసూళ్లు రాబట్టడం కూడా విడ్డూరమేమీ కాదు. ఇక్కడా అక్కడా అల్లు అర్జున్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ జనాలు ఈ సినిమాతో కనెక్ట్ కావడం గురించి కూడా మరీ ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ కథ తమిళ నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఈ చిత్రం రాబట్టిన వసూళ్లు రూ.పాతిక కోట్లు. కాబట్టి ఇది మరీ పెద్ద ఫిగరేమీ కాదు. కానీ హిందీలో ఈ చిత్రం రూ.85 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం మాత్రం కచ్చితంగా సెన్సేషనే.

హిందీ వెర్షన్ హక్కులు అమ్మింది రూ.10 కోట్లకే. మామూలుగా బన్నీ ప్రతి సినిమా డబ్బింగ్ హక్కులూ రూ.10 కోట్లకు పైగానే అమ్ముడవుతున్నాయి. అతడి చిత్రాలను యూట్యూబ్‌లో డబ్ చేసి రిలీజ్ చేసినా ఈ మేరకు ఆదాయం వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లకు థియేట్రికల్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేసింది గోల్డ్ మైన్స్ సంస్థ. ఐతే వాళ్లు కానీ, ఇటు పుష్ప నిర్మాతలు కానీ ఊహించని స్థాయిలో ఈ చిత్రానికి వసూళ్లు వచ్చాయి.

ఐతే ఇంత తక్కువకు హక్కులు కట్టబెట్టేశామే అని ‘పుష్ప’ నిర్మాతలు ఫీలయ్యే పరిస్థితి వచ్చింది. నిజానికి రూ.20 కోట్ల మార్కును దాటాక వచ్చే ఆదాయంలో 50-50 వాటా తీసుకునేలా ఒక మాట అనుకున్నట్లు సమాచారం. కానీ ట్రేడ్ అనలిస్టులు వసూళ్ల ఫిగర్స్ ఘనంగా ఇస్తున్నారు కానీ.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాత్రం అధికారికంగా సరైన లెక్కలు ఇవ్వట్లేదని, నార్త్ మార్కెట్ మీద పుష్ప నిర్మాతలకు పట్టు లేకపోవడంతో వీళ్లేమీ చేయలేకపోతున్నారని.. వాటా ప్రకారం చాలా తక్కువ మొత్తమే ఇచ్చారని తెలిసింది.

ఐతే ‘పుష్ప’ ప్రొడ్యూసర్లు ఈ విషయంలో పెద్దగా ఫీల్ కావట్లేదు. ‘పుష్ప-1’కు ఆదాయం తగ్గినా.. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం ‘పుష్ప-2’కు కలిసొస్తుందని.. దాని హక్కుల కోసం గోల్డ్ మైన్స్ వాళ్లు వచ్చినా.. ఇంకే సంస్థ వచ్చినా.. దానికున్న క్రేజ్‌కు తగ్గట్లు భారీ రేటే చెప్పొచ్చని.. సరిగ్గా ప్రమోట్ చేసి హైప్ ఇంకా పెంచితే రూ.70-80 కోట్ల మేర హక్కులు అమ్మొచ్చని భావిస్తున్నారట.

This post was last modified on January 20, 2022 6:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

1 hour ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

2 hours ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

2 hours ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

2 hours ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

3 hours ago

ట్రంప్ కేబినెట్ నిండా బిలియనీర్లే

అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…

4 hours ago