Movie News

బంగార్రాజూ.. ఏమిటీ విడ్డూరం?

మిగతా విషయాల్లో ఎవరి అభిరుచి ఎలా ఉన్నప్పటికీ.. సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులందరి ఆలోచనా ఒకేలా ఉండేది ఒకప్పుడు. బేసిగ్గా ఆంధ్రా ప్రాంతంలో సినిమాల పిచ్చి కాస్త ఎక్కువ కాబట్టి మిగతా చోట్ల కంటే అక్కడ వసూళ్లు కాస్త ఎక్కువ ఉంటాయి. అంతే తప్ప సినిమా రిజల్ట్ విషయంలో ఒక్కో చోట ఒక్కో రకమైన ఫలితం రావడం ఎప్పుడో కానీ జరగదు. కానీ ఈ మధ్య ఈ అంతరం స్పష్టంగా కనిపిస్తోంది.

తెలంగాణలో బ్లాక్‌బస్టర్లు, హిట్లు అనిపించుకుంటున్న సినిమాలు ఆంధ్రాలో బాక్సాఫీస్ ఫెయిల్యూర్లుగా నిలుస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటమే. సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ రేట్లు తక్కువగా ఉండటంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండక ఏపీలో సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. 

కానీ ‘బంగార్రాజు’ సినిమా విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరుగుతోంది. ఈ చిత్రం ఏపీలో తక్కువ రేట్లతోనే సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంటే.. తెలంగాణలో మాత్రం రోజు రోజుకూ పడిపోతున్న వసూళ్లతో సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఫస్ట్ వీకెండ్లో ఆంధ్రా, రాయలసీమ కలిపి రూ.15 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. తెలంగాణలో మాత్రం ఐదున్నర కోట్ల షేర్‌కు పరిమితం అయింది. పండుగ సెలవుల్లో ఆంధ్రా, రాయలసీమ జనాలంతా తమ స్వస్థలాలకు వెళ్లి అక్కడే ‘బంగార్రాజు’ సినిమా చూడటం వల్ల ఈ వసూళ్ల అంతరం ఎక్కువ ఉందేమో అనుకున్నారు.

కానీ వీకెండ్ తర్వాత ‘బంగార్రాజు’ పరిస్థితిలో మార్పు లేదు. తెలంగాణలో ఈ సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ సినిమాకు ఎంత వీక్ డే అయినా సరే.. బుధవారం ఈ చిత్రానికి తెలంగాణ అంతటా కలిపి రూ.8 లక్షల షేర్ వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఆంధ్రాలో నిన్న ఈ చిత్రానికి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఆక్యుపెన్సీ 50 శాతానికి తగ్గించి, చాలా చోట్ల నైట్ షోలు రద్దు చేసినా ఆంధ్రాలో షేర్ కోటి కన్నా ఎక్కువే వచ్చింది ఆరో రోజు. ఒక సినిమాకు రెండు ప్రాంతాల్లో కలెక్షన్ల పరంగా ఇంత వైరుధ్యం ఆశ్చర్యం కలిగించే విషయం.

This post was last modified on January 20, 2022 2:39 pm

Share

Recent Posts

రామాయ‌ణం.. ఒక్క స‌న్నివేశానికి ఆరున్న‌రేళ్లు

ఇప్పుడు ఇండియ‌న్ సినిమా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ది రామాయ‌ణం సినిమా కోస‌మే. 4 వేల కోట్ల బ‌డ్జెట్ అని…

23 minutes ago

మేన‌కోడ‌లి పెళ్లి జ‌గ‌న్ పొలిటిక‌ల్ ఇమేజ్‌ను శాసిస్తుందా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఇమేజ్‌పై ఆయన మేనకోడలి పెళ్లి…

6 hours ago

సంచ‌ల‌నం: చోటా రాజ‌న్ నిర్దోషి!

ఎవ‌రి పేరు చెబితే.. రాజ‌కీయ నేత‌ల నుంచి అధికారుల వ‌ర‌కు వ‌ణికిపోయేవారో.. అలాంటి వ్య‌క్తి చోటా రాజ‌న్‌. మూడు ద‌శాబ్దాల…

8 hours ago

రాప్తాడు దారుణానికి ప్రేమ నిరాకరణే కారణమా?

రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో బాలికపై అమానుష దాడి ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.…

10 hours ago

ఇది రజినీ ఒక్కడికే సాధ్యం

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇప్పుడు 76 ఏళ్లు. ఈ వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర ఆయన చూపిస్తున్న హవా అసామాన్యం. తమిళంలో…

10 hours ago

తెరపై హింసకు అడ్డుకట్ట వేయాల్సిందే

గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత తెరమీద వయొలెన్స్ వికృత రూపాలు దాల్చింది. హత్యలు ఎంత దారుణంగా చేయొచ్చో…

12 hours ago