గోల్డ్ మైన్ ఫిలిమ్స్.. ఈ సంస్థది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద సక్సెస్ స్టోరీ. జియో ఇంటర్నెట్ విప్లవాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఈ రోజు వందలకోట్ల టర్నోవర్‌కు ఎదిగిన సంస్థ ఇది. ఈ సినిమా కంటెంట్ అందించేది హిందీలో. కానీ దీని పెట్టుబడి అంతా సౌత్ సినిమాలే. బాలీవుడ్లో కొన్నేళ్లుగా మాస్ సినిమాలు బాగా తగ్గిపోయి యూపీ, బీహార్ సహా మాస్ ప్రేక్షకులు ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో నైరాశ్యంలో ఉన్న ప్రేక్షకులే లక్ష్యంగా ఈ సంస్థ యూట్యూబ్‌లో కొన్నేళ్ల కిందట సౌత్ మాస్ మసాలా సినిమాలను హిందీలో డబ్ చేసి వదలడం మొదలుపెట్టింది.
ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు వేటినీ వదిలిపెట్టలేదు. జియో పుణ్యమా అని ఇంటర్నెట్ చౌకగా మారి కావాల్సినంత డేటా అందుబాటులో ఉండటంతో నార్త్ జనాలు.. దక్షిణాది నుంచి వచ్చే ప్రతి డబ్బింగ్ సినిమానూ విరగబడి చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రెబల్ లాంటి డిజాస్టర్ మూవీకి కూడా పదుల కోట్లలో వ్యూస్ వచ్చి పడ్డాయి. రామ్ లాంటి మిడ్ రేంజ్ హీరో, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి ఫ్లాప్ హీరో సైతం ఉత్తరాదిన మాంచి ఫాలోయింగ్ సంపాదించారు డబ్బింగ్ సినిమాలతో.
ఇక ప్రభాస్, అల్లు అర్జున్‌ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. వాళ్ల సినిమా ఏదైనా కొత్తగా ఒకటి వదిలారంటే కోట్లల్లో వ్యూస్ వచ్చి పడిపోతాయి. బన్నీ సినిమాలు సరైనోడు, దువ్వాడ జగన్నాథంలకు వచ్చిన వ్యూస్ చూస్తే పిచ్చెక్కి పోతుంది. మన స్టార్లు నటించిన పెద్ద సినిమాలకు ఏదో ఒక ‘ఖిలాడి’ అని జోడించి సినిమా రిలీజ్ చేయడం.. అక్కడ కోట్లల్లో వ్యూస్, అలాగే భారీగా ఆదాయం అందుకోవడం.. కొన్నేళ్లుగా గోల్డ్ మైన్ ఫిలిమ్స్ ఇలాగే ఎదిగింది. చూస్తుండగానే డబ్బింగ్ సినిమాల మార్కెట్ పెరిగిపోయి మన స్టార్ల సినిమాల డబ్బింగ్ రైట్స్ రూ.10 కోట్లకు పైగా పలికే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడీ సంస్థ మన సినిమాలతో థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్లోకి కూడా అడుగు పెట్టింది. ఇంతకుముందు ‘నా పేరు సూర్య’ను థియేటర్లలో రిలీజ్ చేసి మంచి ఫలితాన్నందుకున్న గోల్డ్ మైన్ ఫిలిమ్స్.. తాజాగా ‘పుష్ప’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసి జాక్ పాట్ కొట్టింది. ఈ చిత్రంతో భారీ లాభాలందుకుని తన రేంజ్ పెంచుకుంది. ఒకప్పుడు సౌత్ నుంచి సినిమాలను డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటే ఆ సంస్థను లైట్ తీసుకున్న బాలీవుడ్ జనాలు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుగుదల చూసి షాకవుతున్నారు. పేరున్న నిర్మాణ సంస్థల్నిమించి అదిప్పుడు ఆదాయం సాధిస్తుండటం చూసి వారికి దిమ్మదిరిగిపోతోంది.
This post was last modified on January 20, 2022 2:36 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…