ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బన్నీకి నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చింది. పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఫ్యూచర్ లో అటువంటి కథలనే ఎన్నుకోవాలని చూస్తున్నారు. ముందుగా ‘పుష్ప 2’ సినిమాను పూర్తి చేయబోతున్నారు.
దీని తరువాత బన్నీతో సినిమాలు చేయడానికి బోయపాటి శ్రీను, కొరటాల శివ లాంటి డైరెక్టర్లు లైన్ లో ఉన్నారు.
అయితే బన్నీ మాత్రం ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ తో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. రజినీకాంత్ తో ‘2.0’, ఇప్పుడు కమల్ హాసన్ తో ‘ఇండియన్2’ సినిమాను నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్ బన్నీతో ఓ సినిమా చేయాలనుకుంటుంది.
ఈ మేరకు హీరోని కలిసి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారట. లైకా ప్రొడక్షన్స్ లో భారీ పాన్ ఇండియా సినిమా చేయడానికి బన్నీ అంగీకరించినట్లు సమాచారం. ‘పుష్ప’ సినిమాను కోలీవుడ్ లో లైకా సంస్థ రిలీజ్ చేసింది. దాదాపు రూ.7 కోట్లకు సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దక్కించుకుంది.
ఇప్పుడు తమ బ్యానర్ లోనే బన్నీ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు లైకా నిర్మాతలు. మరి దీనికి డైరెక్టర్ గా ఎవరిని కన్ఫర్మ్ చేస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉంది కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. ఇందులో గీతాఆర్ట్స్ కూడా పెట్టుబడి పెడుతుందట.
This post was last modified on January 19, 2022 6:20 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…