టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో చాలామంది ఏదో ఒక సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి.. తమ చిజిల్డ్ బాడీతో షో చేసిన వాళ్లే. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టింది అల్లు అర్జున్ అనే చెప్పాలి. అతను ‘దేశముదురు’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి అప్పట్లో అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. అప్పటిదాకా స్టార్ హీరోల్లో ఎవ్వరూ అలాంటి ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్.. ఇలా చాలామంది సిక్స్ ప్యాక్స్‌తో అలరించారు. తర్వాత లీగ్ హీరోల్లో అదిరిపోయే రీతిలో బాడీ పెంచి ఆశ్చర్యపరిచిన వాళ్లలో రామ్ ఒకడు.
మామూలుగా చూడ్డానికి చాక్లెట్ బాయ్‌లా కనిపించే అతను.. ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం పూర్తిగా అవతారం మార్చేశాడు. చాలా రఫ్‌గా ఉండే లుక్‌కు తోడు.. సిక్స్ ప్యాక్ బాడీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా చివర్లో బేర్ బాడీతో అతను ఫైట్ చేయడం మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇప్పుడు రామ్ మరోసారి ఈ ఫీట్ రిపీట్ చేయబోతున్నాడు. కాకపోతే ‘ఇస్మార్ట్ శంకర్’తో పోలిస్తే ఈసారి అతడి లుక్ పూర్తి భిన్నంగా కనిపించనుంది. తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి రామ్ తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ది వారియర్’ అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు సంక్రాంతి సందర్భంగా. అందులో రామ్ పోలీస్ పాత్రలో కనిపించాడు. తన కెరీర్లో రామ్ చేస్తున్న తొలి పోలీస్ పాత్ర ఇదే. ఈ పాత్ర కోసం రామ్ శారీరకంగా మరింత కష్టపడ్డాడట.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మధ్యలో ‘రెడ్’ కోసం నార్మల్ బాడీలోకి వచ్చిన రామ్.. ఈ సినిమా కోసం నాలుగు నెలల పాటు కష్టపడి మళ్లీ బాడీ పెంచాడట. ‘ఇస్మార్ట్ శంకర్’ను మించి ఇందులో కండలు తిరిగిన శరీరంతో, సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నాడట. ఓ సన్నివేశంలో బేర్ బాడీతో అతను సందడి చేయబోతున్నట్లు సమాచారం. ‘సీటీమార్’ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
This post was last modified on January 19, 2022 5:52 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…