మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’లో నటిస్తున్నారు. అలానే మెహర్ రమేష్, బాబీ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ కుటుంబానికి చెందిన ఓ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో చిరంజీవి చిన్న కూతురు తను ప్రేమించివాడితో వెళ్లిపోయింది. ఆ విషయంలో మెగాస్టార్ చాలా బాధ పడ్డారు.
కానీ శ్రీజ తన భర్తతో విడిపోయి మళ్లీ తండ్రి దగ్గరకే వచ్చింది. కుటుంబంతో కలిసి ఉంటూ తన విడాకుల బాధను మర్చిపోయింది. కొన్నాళ్లకు చిరు తన స్నేహితుడి కొడుకు కళ్యాణ్ దేవ్ తో శ్రీజకు రెండో పెళ్లి చేశారు. స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు.
కానీ ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారని వార్తలొచ్చాయి. దానికి తగ్గట్లే శ్రీజ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో తన పేరు పక్కన భర్త పేరును తొలగించింది. దీంతో విడాకుల వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి తన చిన్న కూతురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారట.
శ్రీజ, కళ్యాణ్ దేవ్ లను కూర్చోబెట్టి ప్యాచప్ చేయడానికి ట్రై చేసినట్లు తెలుస్తోంది. మెగాఫ్యామిలీకి చెందిన కొందరు సభ్యులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారట. కానీ శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల మధ్య సఖ్యత రాకపోగా.. మరింత దూరం పెరిగిందని సమాచారం. కూతురికి నచ్చజెప్పలేక చిరు కూడా సైలెంట్ అయిపోయారట. త్వరలోనే శ్రీజ తన విడాకుల విషయాన్ని అఫీషియల్ గా చెప్పే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on January 19, 2022 10:20 am
కొత్త ఏడాది మొదలయ్యాక సినీ ప్రియులందరి దృష్టి సంక్రాంతి చిత్రాల మీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ…
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు,…
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ సినిమా వారం రోజులుగా బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న తీరు చూసి ట్రేడ్ పండిట్లు…
సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్తో దూసుకుపోతున్న చిత్రం.. సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి…
తమిళ స్టార్ హీరో విశాల్.. ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పుష్కర కాలం కిందట విడుదల…
మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఏప్రిల్ 25 విడుదల నిర్ణయంలో ఎలాంటి మార్పు…