తమిళ నటుడు ధనుష్ కెరీర్ ఆరంభం నుంచే అదిరిపోయే క్యారెక్టర్లతో తనేంటో చాటి చెప్పినా అతడి స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి పరోక్షంగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడం ఒక కారణమైంది. అసలు ఇతర భాషల వాళ్లు ముందుగా అతణ్ని గుర్తించింది రజినీ అల్లుడిగానే. కొన్నేళ్ల ముందు వరకు కూడా అతడి గురించి ప్రస్తావించే ముందు రజినీ అల్లుడు అనే అనేవాళ్లు.
రజినీ ఫ్యాన్స్ ధనుష్‌ను ఓన్ చేసుకుని.. అతడి ఇమేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంలో కీలక పాత్ర పోషించారు. కోలీవుడ్లో ధనుష్ వెయిట్ పెరగడానికి కచ్చితంగా రజినీ అల్లుడు కావడం ఒక కారణం అనడంలో సందేహం లేదు. ఇప్పుడు రజినీ కూతురు ఐశ్వర్య నుంచి ధనుష్ విడాకులు తీసుకున్న నేపథ్యంలో రజినీ బ్యాకప్‌ను ధనుష్ కోల్పోతున్నాడే.. ఇది అతడి కెరీర్‌కు ఇబ్బంది కదా అనే చర్చ నడుస్తోంది ధనుష్.ఐతే గత కొన్నేళ్లలో ధనుష్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అతడి స్థాయి పెరిగిపోయింది.
తన పరిధిని అతను కోలీవుడ్‌ను దాటి ఎక్కడికో విస్తరించాడు. ఇంకా చెప్పాలంటే రజినీని మించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు. ఆల్రెడీ ‘ఫకీర్’ అనే ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్న ధనుష్.. గత ఏడాది నెట్ ఫ్లిక్స్ కోసం ఒక ఇంటర్నేషనల్ సిరీస్‌లో ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు, ఆర్టిస్టులతో కలిసి పని చేస్తున్నాడు. రాన్జానా, అత్రంగిరే లాంటి సినిమాలతో బాలీవుడ్లో అతడి ఇమేజ్ పెరిగిపోయింది.
తెలుగులోనూ ధనుష్‌కు మంచి ఆదరణే ఉంది. ‘సార్’ సినిమాతో నేరుగా తెలుగు సినిమాల్లోకి అడుగు పెడుతున్నాడు. మరోవైపు రజినీ సంగతి చూస్తే గత కొన్నేళ్లలో ఆయన ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి. ఆయన సినిమా కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమాల పరంగా రజినీ సపోర్ట్ ధనుష్‌కు ఎంతమాత్రం అవసరం లేదు. ఐశ్వర్యతో అతడికి ఏం ఇబ్బందులొచ్చాయో ఏమో కానీ.. విడాకుల నిర్ణయం తీసుకోకుండా ఆపడానికి రజినీ అల్లుడిగా వచ్చే హోదా కారణం కాలేకపోయింది.
This post was last modified on January 18, 2022 8:00 pm
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…