Movie News

బంగార్రాజు రివర్స్ గేర్

సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు పున:ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. తెలుగులో రిలీజైన ఏ సినిమా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. వేరే ప్రాంతాలన్నింట్లో బ్లాక్‌బస్టర్, సూపర్ హిట్ స్టేటస్ అందుకున్న ‘పుష్ప’ మూవీ కూడా ఏపీలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను ఏపీ మొత్తానికి రూ.45 కోట్లకు పైగా రేటుతో అమ్మారు. చివరికి చూస్తే అక్కడ వచ్చిన షేర్ రూ.30 కోట్లే.

దీన్ని బట్టే ఈ సినిమా ఏపీ స్టేటస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీని కంటే ముందు రిలీజై బ్లాక్ బస్టర్ అయిన ‘అఖండ’ సైతం ఏపీలో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దాని మీద పెట్టుబడులు తక్కువ కావడం వల్ల బ్రేక్ ఈవెన్‌ అయినప్పటికీ పెద్దగా లాభాలైతే తెచ్చిపెట్టలేదు. దీనికంతటికీ కారణం ఏపీలో టికెట్ల ధరలు తగ్గించడమే అనడంలో సందేహం లేదు. ధరల నియంత్రణ మొదలైంది ‘వకీల్ సాబ్’ మూవీతో అన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం కూడా ఏపీలో అండర్ పెర్ఫామ్ చేసింది.

ఆ తర్వాత ఇప్పటిదాకా అన్ని సినిమాలకూ ఇదే ఒరవడి కొనసాగింది. ఐతే ఇప్పుడు సంక్రాంతి కానుకగా రిలీజైన ‘బంగార్రాజు’ మాత్రం ట్రెండ్ మార్చింది. ఈ సినిమాకు కూడా టికెట్ల ధరలు ఏపీలో తక్కువగానే ఉన్నప్పటికీ.. మంచి ఆక్యుపెన్సీ రావడంతో వసూళ్లు బాగున్నాయి. మిగతా సినిమాలకు పూర్తి భిన్నంగా ఏపీ కాకుండా మిగతా ఏరియాల్లో ఈ సినిమాకు ఆశించిన వసూళ్లు రావట్లేదు. తెలంగాణలో తొలి రోజు నుంచి ఈ సినిమాకు సరైన వసూళ్లు లేవు. ఓవర్సీస్‌లో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్లు రావట్లేదు. కర్ణాటక మిగతా ప్రాంతాల్లో ప్రభావం అంతంతమాత్రమే. కానీ ఏపీలో మాత్రం వసూళ్లు అంచనాలను మించి వస్తున్నాయి.

తొలి వారాంతంలో ఈ సినిమాకు రూ.22 కోట్ల షేర్ వస్తే.. తెలంగాణలో అటు ఇటుగా రూ.5 కోట్ల షేరే వచ్చింది. ఆంధ్రా, రాయలసీమల్లో కలిపి దీనికి రూ.15 కోట్ల దాకా షేర్ రావడం విశేషం. సీడెడ్ వాటా రూ.4.5 కోట్లు. మిగతా వసూళ్లన్నీ ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చినవే. సంక్రాంతికి తెలంగాణలో ఉన్న ఆంధ్రా వాళ్లంతా తమ సొంత ఊళ్లకు వెళ్లి అక్కడే సినిమాలు చూడటం.. ఇది పక్కా ఆంధ్రా వాళ్లు కనెక్టయ్యే పండుగ సినిమా కావడం ఇందుకు కారణం కావచ్చు. అయినా సరే.. తెలంగాణలో సినిమా ఇంత డల్లుగా నడుస్తుండటం ఆశ్చర్యకరమే.

This post was last modified on January 18, 2022 4:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago