బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆలియా భట్.. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో టాలీవుడ్‌లో అడుగు పెడుతోంది. కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈలోపు ఆలియా మరో తెలుగు మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు.. ఎన్టీఆర్, కొరటాల శివల మూవీ. ఆలియాకి బాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ తెలుగునాట కూడా తనకి బోలెడంత ఫాలోయింగ్ ఉందని ఇప్పుడు ప్రూవ్ అవుతోంది.
అది ఆమెకి బేసిగ్గానే ఉన్న క్రేజా లేక ఆర్‌ఆర్‌ఆర్ కారణంగా ఏర్పడిందా అనేది తెలీదు కానీ.. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఆమేనని నందమూరి అభిమానులంతా ఫిక్సయ్యారు. ఆమే కావాలని కోరుకుంటున్నారు కూడా. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. అందుకే ఈ కాంబోలో సినిమా అనగానే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
తారక్ ఆర్‌ఆర్ఆర్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ కాస్త ఆలస్యమయ్యింది. అతి త్వరలో గ్రాండ్‌గా లాంచ్ చేసి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. దాంతో హీరోయిన్ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి మొదట జాన్వీ కపూర్ పేరు వినిపించింది. తర్వాత అది పుకారని తేలింది. ఆపైన కియారా అద్వానీ ఖరారయ్యిందన్నారు.
కానీ ఆమె రామ్‌చరణ్‌తో కమిటయ్యింది. చివరికి లిస్టు ఆలియా దగ్గరకు వచ్చింది ఆగింది. దాంతో ఈ మూవీకి మరింత హైప్ వచ్చిందనే చెప్పాలి. ఆలియా చాలా టాలెంటెడ్. గ్లామర్‌కీ తక్కువ లేదు. అందుకే ఆమె తమ ఫేవరేట్ హీరోతో జోడీ కట్టాలని నందమూరి ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి నిజంగానే కొరటాల ఆమెని ఫిక్స్ చేశాడో లేక అభిమానుల ఆశ తీర్చడానికైనా ఆమెను తీసుకుంటాడో చూడాలి.
This post was last modified on January 17, 2022 2:40 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…