పక్కా కమర్షియల్ సినిమాలతో మెప్పించే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఊరమాస్‌ని రుచి చూపించాడు. ఆ తర్వాత ‘రెడ్’ సినిమాలో క్లాస్ క్యారెక్టర్‌నీ మాస్ రోల్‌నీ ఒకేసారి పండించాడు. రీసెంట్‌గా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ఒక సినిమాకి కమిటయ్యాడు.
ఇంకేముంది.. ఇద్దరి కాంబినేషన్‌లో అదిరిపోయే మాస్ మూవీ రావడం ఖాయమని ఫిక్సయ్యారంతా. ర్యాపో 19 అనే వర్కింగ్ టైటిల్‌తో స్టార్ట్ చేసిన ఈ మూవీ అసలు టైటిల్‌ను ఇవాళ రివీల్ చేశారు. రామ్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ద వారియర్’ అనే పేరును ఖరాను చేశారు. ఫస్ట్ లుక్‌ను కూడా వదిలారు.
కానిస్టేబుళ్ల మధ్య ఆఫీసర్ హోదాలో హుందాగా నిలబడ్డాడు రామ్. ఖాకీ యూనిఫామ్‌లోని పవర్ అతని కళ్లల్లో కనిపిస్తోంది. ట్రిమ్ చేసిన హెయిర్.. కోర మీసం.. చేతిలో పిస్టల్‌తో అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. ఈ టైటిల్ అతని క్యారెక్టర్‌కి యాప్ట్ అయ్యుండొచ్చనే ఫీలింగ్‌ని తన లుక్‌తో కలిగిస్తున్నాడు.
ఇదొక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ అని, లింగుస్వామి గత చిత్రాలను మించి మాస్‌గా ఉంటుందని చెప్పి ఊరిస్తోంది టీమ్. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో మూవీ రూపొందుతోంది. ఆది పినిశెట్టి విలన్‌గా నటించడం మరింత మంచి అంచనాలను ఏర్పరుస్తోంది. టైటిల్, రామ్ లుక్ చూశాక ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది.
This post was last modified on January 17, 2022 1:33 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…