బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన ఫ్యాన్స్‌కి ఊపిరాడకుండా చేస్తున్న రవితేజ.. సంక్రాంతికి వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తున్నాడు. భోగి సందర్భంగా నిన్న ‘రావణాసుర’ సినిమాని పట్టాలెక్కించాడు. ఇవాళ సంక్రాంతి కానుకగా ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ పోస్టర్‌తో పలకరించాడు.
శరత్ మండవ దర్శకతంలో నటిస్తున్న ఈ చిత్రంలో గవర్నమెంట్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు రవితేజ. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి పోస్టర్ ఆకట్టుకుంది. సంక్రాంతి స్టిల్ కూడా అందుకు తీసిపోకుండా ఉంది. గోల్డ్ కలర్ షర్ట్, తెల్లని పంచెతో ట్రెడిషనల్‌గా ఉన్నాడు మాస్ మహరాజా. సేమ్ డ్రెస్ వేసుకున్న కొడుకు భుజమ్మీద చేయి వేసి హుందాగా నడుస్తున్నాడు.
పక్కనే రామారావ్ భార్య పాత్రలో సంప్రదాయబద్దంగా ఉంది దివ్యాంశ కౌశిక్. ఆమె చేతిలోని బుట్టని బట్టి ముగ్గురూ గుడికి వెళ్తున్నారని అర్థమవుతోంది. విశేషమేమిటంటే పోయినేడు సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్’ పోస్టర్ కూడా దాదాపు ఇలాంటిదే. అందులో కూడా రవితేజ, భార్య శ్రుతీహాసన్, వారి కొడుకు ఉంటారు. రవితేజ, తన కొడుకు ఒకేలా రెడీ ఉంటారు. శ్రుతీహాసన్ సంప్రదాయబద్దమైన చీరకట్టులో ఉంటుంది. ముగ్గురూ నైవేద్యాలు పట్టుకుని గుడికి వెళ్తూ ఉంటారు.
కాకపోతే నడిచి కాదు.. బైక్ మీద. అదొక్కటే తేడా. ఏదేమైనా సంక్రాంతి పోస్టర్ మాత్రం అదిరిందనే చెప్పాలి. కర్ణన్, జై భీమ్ చిత్రాల ఫేమ్ రాజీషా విజయన్ ఇందులో మరో హీరోయిన్‌గా చేస్తోంది. వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నాజర్, పవిత్రా లోకేష్, నరేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నాడు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మార్చ్ 25న మూవీని రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
This post was last modified on January 15, 2022 2:21 pm
బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. మాములుగా మన దగ్గర స్టార్ హీరో రిలీజ్…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సేవా కార్యక్రమాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తన మనసుకు…
బాలీవుడ్ కు గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే ఇచ్చిన దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు మంచి పేరుంది. ఇప్పుడంటే…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హఠాత్తుగా మళ్ళీ పుకార్లు మొదలైపోయాయి. హైదరాబాద్ కు…
టాలీవుడ్ లో పునర్జన్మలది సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు. ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ కథతో వచ్చాయి. ఏఎన్ఆర్ మూగ…
మార్చి నెలాఖరులో మొదటి రౌండ్ బాక్సాఫీస్ ఫైట్ నిన్న పూర్తయ్యింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఎల్2 ఎంపురాన్ ఇతర భాషల్లో…