యావరేజ్, బిలో యావరేజ్ ఇచ్చిన దర్శకులు సైతం.. కామ్‌గా సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నారు. అలాంటిది ఓ సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హీరోలేక ఖాళీగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ దర్శకుడెవరో కాదు.. మారుతి.
‘ప్రతిరోజూ పండగే’లో ఓ హిట్టు కొట్టాడు. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో ఇదే పెద్ద హిట్టు. ఆ సినిమా గతేడాది డిసెంబరులో విడుదలైంది. అంటే.. ఇప్పటికి ఏడు నెలలు గడిచిపోయాయి. అయినా మారుతి తదుపరి సినిమా ఏమిటన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
ముందు రామ్ తో ఓ సినిమా చేద్దామనుకున్నాడు. ఇద్దరి మధ్యా చర్చలు కూడా జరిగాయి. కానీ… కుదర్లేదు. వరుణ్ తేజ్, నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ.. ఇలా ఏ హీరోని చూసినా బిజీ.. బిజీ. వీళ్లెవ్వరూ 2021 వరకూ కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి. పోనీ.. సాయిధరమ్ తోనే మరో సినిమా చేద్దామా? అనుకున్నా, కుదరని పని. ఎందుకంటే తన చేతిలోనే ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ ఒకే హీరోతో సినిమా చేసినా కిక్ ఇవ్వదు.
ఇలా ఎలా చూసినా 2021 లోనూ మారుతి సినిమా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చేతిలో ఉన్న సినిమా చేజారిపోయి, అనూహ్యంగా ఏ హీరో అయినా ఖాళీ అయిపోతే తప్ప.. ఇప్పటికిప్పుడు మారుతి సినిమా ఏదీ పట్టాలెక్కదు. ఈ విషయం తెలిసేనేమో.. మారుతి కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించుకుంటున్నాడు. ఈలోగా ఓ వెబ్ సిరీస్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ‘ఆహా’ కోసం ఓ స్క్రిప్టుని కూడా సిద్ధం చేశాడని టాక్.
This post was last modified on June 11, 2020 8:29 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…