బాలీవుడ్‌లో రోజుకో అఫైర్ బయటపడుతూ ఉంటుంది. వాటిలో అనఫీషియల్‌గా తెలిసేవే ఎక్కువ. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లని చూశాం కదా. పెళ్లి కూడా చేసేసుకున్నారు కానీ అప్పటివరకు కూడా ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న విషయం తమ నోటితో చెప్పలేదు. కియారా అద్వానీ కూడా సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉంది. అడిగితే ఏవేవో చెప్పుద్ది తప్ప అసలు విషయం మాత్రం ఒప్పుకోదు.
తాను మాత్రం ఆ టైప్ కాదంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పోయినేడు అక్టోబర్‌లో రకుల్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ తమ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ప్రకటించారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి రకుల్‌కి.
ఇంత పెద్ద సెలెబ్రిటీ అయ్యుండి అంత ఓపెన్‌గా మీ ప్రేమ గురించి ఎలా చెప్పేశారు అని అడిగితే నవ్వేసింది రకుల్. ‘ఇందులో దాచిపెట్టడానికి ఏముందసలు! రహస్యంగా దాక్కుని పరుగులు పెట్టేవారు చాలామంది ఉన్నారు. కానీ మేమిద్దరం ఆ టైప్ కాదు. మాకసలు అలాంటి ఆలోచనలే రావు. ప్రేమలో పడటం తప్పు కాదు. మేం ఒకర్నొకరం గౌరవించుకుంటాం. మా రిలేషన్‌నీ గౌరవిస్తాం. అందుకే ఓపెన్‌గా చెప్పేశా’ అని చెప్పింది రకుల్.
ఏం చేసినా పబ్లిక్‌గా, ట్రాన్స్పరెంట్‌గానే చేస్తాను తప్ప సీక్రెట్లు మెయింటెయిన్ చేయడం తనకు అలవాటు లేదని తెగేసి చెప్పి మార్కులు కొట్టేసిందామె. ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉంది రకుల్. ఈ యేడు తను నటించిన నాలుగైదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరికొన్ని లైన్‌లో ఉన్నాయి. ప్రస్తుతానికి వాటిపైనే దృష్టి పెట్టానని, అవన్నీ ఓ కొలిక్కి వచ్చాక పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని చెబుతోంది.
This post was last modified on January 15, 2022 5:24 am
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…