Movie News

బంగార్రాజు సీక్వెల్.. ఇంకెన్నేళ్లో..

సోగ్గాడే చిన్నినాయనా సినిమా వచ్చినపుడు దానికి సీక్వెల్ ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సీక్వెల్ ప్రపోజల్ నాగార్జున ముందు పెట్టాడు. ఈ సినిమా చేయడానికి నాగ్ ఓకే అన్నాడే కానీ.. ఒక పట్టాన స్క్రిప్టు ఓకే చేయలేదు. మరీ ఆశ్చర్యకరంగా ఈ స్క్రిప్టు మీద మూణ్నాలుగేళ్లు పని చేశాడు కళ్యాణ్.

‘సోగ్గాడే..’ తర్వాత అతను వెంటనే వర్క్ చేసిన స్క్రిప్టు ఇదే. కానీ మధ్యలో రారండోయ్ వేడుక చూద్దాం, నేల టిక్కెట్టు సినిమాలు చేశాడు. మళ్లీ ‘బంగార్రాజు’ మీదే పని చేశాడు. ‘నేల టిక్కెట్టు’ తర్వాత కూడా ఈ సినిమా పట్టాలెక్కడానికి మూడేళ్లకు పైగానే సమయం పట్టింది. ఎట్టకేలకు గత ఏడాది మధ్యలో ఈ స్క్రిప్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..సినిమాను పట్టాలెక్కించాడు నాగార్జున.

సంక్రాంతి కానుకగా మంచి అంచనాల మధ్య ఈ సినిమా రిలీజవుతోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.ఐతే ‘బంగార్రాజు’కు సీక్వెల్ ఉంటుందా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. దీనికి నాగార్జున సమాధానం చెప్పాడు. బంగార్రాజుది ఎప్పుడైనా, ఏ టైం లైన్లో అయినా వచ్చి సందడి చేయడానికి స్కోప్ ఉన్న పాత్ర అని.. కాబట్టి సోగ్గాడే ఫ్రాంఛైజీలో ఇంకో సినిమా రాదని అనుకోవద్దని ఆయనన్నారు.

బంగార్రాజుకు కూడా సీక్వెల్ చేద్దామని ఆల్రెడీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తనతో అన్నాడని.. కథ నచ్చితే చేద్దామని అన్నానని.. ఐతే ముందు బంగార్రాజు తాము అనుకున్న స్థాయిలో విజయం సాధించాలని నాగ్ పేర్కొన్నాడు. ఐతే ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంత పెద్ద హిట్ అయినా సరే.. ‘బంగార్రాజు’ స్క్రిప్టును ఒక పట్టాన ఓకే చేయలేదు నాగ్. ఒక రకంగా కళ్యాణ్ ఈ సినిమా విషయంలో టార్చర్ అనుభవించాడని సన్నిహితులు అంటుంటారు. మరి ‘బంగార్రాజు’కు అన్నేళ్లు వెయిట్ చేయంచిన నాగ్.. దీని సీక్వెల్ అంటే ఇంకెన్నేళ్లు కళ్యాణ్‌ నిరీక్షించేలా చేస్తాడో?

This post was last modified on January 14, 2022 11:57 am

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

56 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago