ఈ మధ్య కాలంలో తెలుగులో సంచలన విజయం అంటే ‘అఖండ’దే. ‘రూలర్’ లాంటి డిజాస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సాగించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదేమీ రికార్డులు తిరగరాసిన సినిమా కాదు కానీ.. దాని స్థాయిలో అది అసాధారణంగా ఆడేసింది.
ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా అయినా రెండో వీకెండ్ తర్వాత చేతులెత్తేస్తున్న ఈ రోజుల్లో నెల రోజుల తర్వాత కూడా దీనికి హౌస్ ఫుల్స్ పడటం.. ఇంకా దాని థియేట్రికల్ రన్ కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ చిత్రంతో బాలయ్య తొలిసారి వంద కోట్ల గ్రాస్ మార్కును దాటేశాడు. బోయపాటి శ్రీనుతో బాలయ్య కాంబినేషన్‌కు ఉన్న పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి రుజువు చేసింది.
దీంతో బాలయ్య మళ్లీ మళ్లీ బోయపాటితో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ‘అఖండ’కు సీక్వెల్ తీస్తే బాగుంటుందన్న కోరిక కూడా వారిలో బలంగా ఉంది.ఇదే విషయాన్ని బోయపాటి శ్రీను దగ్గర ప్రస్తావిస్తే.. ఆయనేమీ ఈ విషయాన్ని కొట్టి పారేయలేదు. ‘అఖండ’కు కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని నొక్కి వక్కాణించాడు బోయపాటి. ఐతే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేనని మాత్రం బోయపాటి అన్నాడు. ‘అఖండ’కు సీక్వెల్ తీయడానికి కావాల్సిన ట్రిగ్గర్ పాయింట్ అందులో ఉందని.. అదేంటో ఇప్పుడే చెప్పనని బోయపాటి తెలిపాడు.
కచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నామని.. అన్నీ కుదిరినపుడ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పాడు. బోయపాటి ఏదో యధాలాపంగా ఈ మాట అన్నట్లుగా లేదు. నిజంగానే ‘అఖండ-2’ చేసేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి.. అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య బాలయ్య, బన్నీ చాలా సన్నిహితంగా కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్లిద్దరితో కలిసి మల్టీస్టారర్ చేసే ఉద్దేశాలేమైనా ఉన్నాయా అని బోెయపాటిని అడిగితే.. ‘‘ప్రయత్నిద్దాం. ఏదీ జరగదని అనుకోవద్దు. ఏది ఎలా జరగాలో కాలమే నిర్ణయిస్తుంది’’ అంటూ నర్మగర్భంగా సమాధానం చెప్పాడు బోయపాటి.
This post was last modified on January 13, 2022 9:21 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…