యాంగ్రీ యంగ్‌మేన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నాటి నుంచి రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చారు రాజశేఖర్. మధ్యలో కొన్నాళ్లు వరుస పరాజయాలతో వెనకబడిపోయారు. దాంతో ఆయన పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ ‘గరుడవేగ’ సినిమాతో యాంగ్రీ స్టార్‌గా అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారాయన. ఆ తర్వాత ‘కల్కి’ మూవీ ద్వారా మరింత ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం మలయాళ చిత్రం ‘జోసెఫ్’ రీమేక్ ‘శేఖర్’లో నటిస్తున్నారు.
హీరోగానే కాదు.. అవకాశం వస్తే ఇంపార్టెంట్ రోల్స్‌తో పాటు విలన్‌గానూ నటించడానికి రెడీ అని సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు శేఖర్. దాంతో కొందరు ఆయనకి కొన్ని పాత్రలు ఆఫర్ చేశారట కూడా. కానీ ఏదీ ఎక్సయిట్ చేయకపోవడంతో ఆయన నో అన్నారని టాక్. అయితే ఇన్నాళ్లకి రాజశేఖర్ కోరిక తీరనున్నట్టు తెలుస్తోంది.
ఓ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారట రాజశేఖర్. ఆ హీరో ఎవరో కాదు.. ఎన్టీఆర్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత సినిమా చేయడానికి కొరటాల శివని లైన్‌లో పెట్టాడు తారక్. హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఇందులో హీరోకి బాబాయ్ పాత్ర ఒకటి ఉందట. అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. దానికి రాజశేఖర్ అయితే యాప్ట్ అని మేకర్స్ ఫీలయ్యారని, శేఖర్ కూడా ఓకే అన్నారని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఈ సినిమాని ఈ యేడు ఏప్రిల్ 22న విడుదల చేయాల్సి ఉంది. కానీ తారక్ ‘ఆర్‌ఆర్‌ఆర్’కి, కొరటాల ‘ఆచార్య’కి లాక్ అయ్యి ఉండిపోవడంతో ఇంతవరకు మూవీ సెట్స్‌కి వెళ్లలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఒకవేళ రాజశేఖర్‌కి సంబంధించిన బజ్ నిజమైతే కనుక ప్రాజెక్ట్‌కి ఆయన అడిషనల్ అట్రాక్షన్ అవుతారనడంలో సందేహమే లేదు. విభిన్న పాత్రల్లో కనిపించాలనే రాజశేఖర్ కోరికని తారక్, కొరటాల కలిసి తీరుస్తారేమో చూడాలి మరి.
This post was last modified on January 10, 2022 7:35 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…