తెలుగు తెరపైకి మరో కొత్త హీరో వస్తున్నాడు. అతనే.. గల్లా అశోక్. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త కథానాయకుడితను. ఆయన తనయురాలు పద్మావతి, అల్లుడు గల్లా జయదేవ్‌ల కొడుకే ఈ అశోక్. కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా ఘన వారసత్వంతోనే అతను హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. కాకపోతే తొలి సినిమా రిలీజ్ ముంగిట అతను కోరుకున్న ప్రమోషనే దక్కట్లేదు.
అశోక్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ‘హీరో’ మూవీ చాన్నాళ్ల కిందటే పూర్తయింది. కానీ రిలీజ్ విషయంలో సరైన టైమింగ్ కుదరక సినిమాను హోల్డ్ చేసి పెట్టారు. పది రోజుల కిందట ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటంతో హడావుడిగా సంక్రాంతి విడుదలకు సినిమాను సిద్ధం చేశారు. కొత్త హీరో సినిమాకు ఇలా హడావుడిగా రిలీజ్ అంటే బజ్ తీసుకురావడం కష్టమే.
కనీసం నెల రోజుల ముందు నుంచి ఒక పద్ధతి ప్రకారం సినిమాను ప్రమోట్ చేసి, జనాల్లో ఆసక్తిని పెంచాలి.‘హీరో’ విషయంలో అలా ఏమీ జరగలేదు. కనీసం రిలీజ్ ముంగిట అయినా హైప్ పెంచుదామనుకుంటే.. పరిస్థితులు తిరగబడ్డాయి. నిజానికి అశోక్ సినిమాకు హైప్ తీసుకురావడం మహేష్ బాబు చేతుల్లోనే ఉంది. సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ పెట్టి మహేష్ బాబును ముఖ్య అతిథిగా పిలవాలనుకున్నారు. ఆయనే తన మేనల్లుడిని జనాలకు పరిచయం చేసి, అతడి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే బాగుండేది.
కానీ ఈవెంట్ గురించి ప్లాన్ చేస్తున్నపుడే మహేష్ కరోనా బారిన పడ్డాడు. మేనల్లుడి గురించి ఒక బైట్ కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్నాడు. మహేష్ మీద ఆశలు వదులుకుని తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కొంచెం ఘనంగా చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు హఠాత్తుగా మరణించారు.
దీంతో కృష్ణ కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. మిగతా ప్రమోషన్లు సైతం పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో సినిమా పెద్దగా ప్రచారం లేకుండానే రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు ముందు నుంచి బజ్ లేకపోగా.. రిలీజ్ ముంగిట పరిణామాలు ప్రతికూలం అయ్యాయి. దీంతో అశోక్ లాంచింగ్ ఏమాత్రం హడావుడి లేకుండా జరగబోతోంది. నిజానికి అశోక్ లాంచింగ్ దిల్ రాజు చేతుల మీదుగా జరగాల్సింది. కొన్ని కారణాలతో అది జరగలేదు. తర్వాత ‘హీరో’ సినిమా చేస్తే దాని విడుదల ముంగిట ఇలా పరిస్థితులు తిరగబడ్డాయి.
This post was last modified on January 9, 2022 5:44 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…