నాగచైతన్య నుంచి విడాకులు పొందినప్పటి నుంచి సమంతను గమనిస్తుంటే.. ఆమె ఫేజ్ దాటడానికి ఇబ్బంది పడుతున్న సంగతి స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. తన సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ పోస్టుల ద్వారా తన స్థితిని ఆమె తెలియజేస్తూనే ఉంది. విడాకులు ఆమె జీవితాన్ని ఒక రకంగా కుదిపేసినట్లే కనిపించింది ఆ పోస్టులు, వివిధ సందర్భాల్లో సమంత స్పందించిన తీరు చూస్తే. తాజాగా మరోసారి సమంత తన బాధను పరోక్షంగా బయటపెట్టింది.
హైదరాబాద్ సిటీలో కొత్తగా మొదలైన ఒక కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది. ఆ సందర్భంగా సమంత.. డిప్రెషన్ వల్ల తలెత్తే దుష్పరిణామాల గురించి, ఆ సమయంలో సన్నిహితుల సహకారం ఎంత అవసరం, అలాగే మానసిక వైద్యుల నుంచి కౌన్సెలింగ్ తీసుకోవడం ఎంత ముఖ్యం అనే విషయాలపై సమంత మాట్లాడింది.వ్యక్తిగత జీవితాల్లో ఒడుదొడుకులు ఎదురైనపుడు లోలోన కుంగిపోకూడదని.. మన చుట్టూ ఉన్న వారి సాయం తీసుకోవాలని సమంత సూచించింది.
తన జీవితంలో కూడా కఠిన దశను ఎదుర్కొన్నానని.. అలాంటపుడు తన సన్నిహితులే తనకు అండగా నిలిచారని ఆమె తెలిపింది. మనం మానసికంగా ఇబ్బంది పడుతున్నపుడు సన్నిహితుల నుంచి సాంత్వన పొందడం చాలా అవసరం అని.. మొహమాట పడకుండా అలాంటి సమయాల్లో దగ్గరి వాళ్లతో మాట్లాడాలని సమంత పేర్కొంది.
అంతే కాక అవసరమైనపుడు మానసిక వైద్యుల సాయం పొందడం కూడా చాలా అవసరమని సమంత పేర్కొంది. మానసిక చికిత్సా కేంద్రాల అవసరం చాలా ఉందని కూడా సమంత అభిప్రాయపడింది. తన వ్యక్తిగత జీవితం గురించి.. డిప్రెషన్ సమస్యల గురించి మాట్లాడుతున్నపుడు సమంత కొంత ఎమోషనల్ అయింది. ఆమె కళ్లల్లో కాస్త నీళ్లు కూడా కనిపించాయి. విడాకుల తర్వాత ఎంత ఇబ్బంది పడ్డప్పటికీ.. త్వరగానే ఈ ఫేజ్ నుంచి బయటపడి సినిమాల్లో బిజీ అవడం ద్వారా కోలుకున్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on January 9, 2022 3:10 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…