కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు మంచి పేరుంది. ఆయన తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా తరువాత దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల చాలా బ్రేక్ తీసుకున్నారు. ఫైనల్ గా తమిళంలో హిట్ అయిన ‘అసురన్’ సినిమాను తెలుగులో ‘నారప్ప’ పేరుతో తెరకెక్కించారు. శ్రీకాంత్ లాంటి డైరెక్టర్ ‘నారప్ప’ సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తారో అని అంతా అనుమానించారు.
కానీ వెంకటేష్ ని ఆయన తెరపై చూపించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. శ్రీకాంత్ అడ్డాల అంటే కేవలం కుటుంబ కథలే కాదని.. అన్ని రకాల సినిమాలు చేయాలగలడని నిరూపించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నారనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. చాలా మంది యంగ్ హీరోల పేర్లు వినిపించాయి. అలానే పవన్ కళ్యాణ్ కి కూడా శ్రీకాంత్ కథ చెప్పినట్లు వార్తలొచ్చాయి.
కానీ ఆయన తన తదుపరి సినిమా ఓ అప్ కమింగ్ హీరోతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బాలకృష్ణతో ‘అఖండ’ సినిమా తీసి సంచలనం సృష్టించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తన బావ మరిదిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారట. దానికి శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా తీసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట శ్రీకాంత్ అడ్డాల. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయిని తీసుకోబోతున్నారట. ఇప్పటివరకు స్టార్ హీరోలతో పని చేసిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు కొత్త హీరోని పరిచయం చేయడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on January 9, 2022 2:29 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…