సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో పెద్ద విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల కిందట తన భార్య విజయ నిర్మలను కోల్పోయిన కృష్ణ.. ఇప్పుడు తన పెద్ద కొడుకు రమేష్ బాబును దూరం చేసుకున్నారు. తండ్రి బతికి ఉండగా కొడుకు చనిపోవడం అంటే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పేదేముంది? ఇప్పటికే విజయ నిర్మలను కోల్పోయి ఒక రకంగా కుంగిపోయిన కృష్ణకు ఈ బాధ భరించలేనిదే. రమేష్ బాబు అంటే కృష్ణకు చాలా ఇష్టం. తన పెద్ద కొడుకును హీరోగా నిలబెట్టాలని ఆయన చాలానే కష్టపడ్డారు. సొంత నిర్మాణ సంస్థలో అతణ్ని హీరోగా పరిచయం చేసి వరుసగా సినిమాలు చేయించారు.
అల్లూరి సీతారామరాజు సినిమాలోనే బాల నటుడిగా తెరంగేట్రం చేసిన రమేష్ బాబు.. తర్వాత బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. ఆపై సామ్రాట్ మూవీతో అతను హీరోగా పరిచయం అయ్యాడు. ఆపై బజార్ రౌడీ, బ్లాక్ టైగర్, ముగ్గురు కొడుకులు, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం.. ఇలా చాలా సినిమాలే చేశాడు. కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. కృష్ణ కొడుకు, పైగా బాల నటుడిగా చేశాడు కాబట్టి హీరోగా పరిచయం అయినపుడు కొన్నేళ్లు క్రేజ్ ఉంది కానీ.. సరైన సినిమాలు పడక, ప్రేక్షకులను ఆకట్టుకోలేక వెనుకబడిపోయాడు రమేష్. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలు తగ్గిపోయాయి.
పూర్తిగా మార్కెట్ కోల్పోవడంతో సినిమాలు ఆపేయాల్సి వచ్చింది. హీరోగా సక్సెస్ కాలేకపోయిన రమేష్ బాబు.. నిర్మాతగా అయినా నిలదొక్కుకోవాలని చూశారు. హిందీ సూర్యవంశం మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి.. అర్జున్ లాంటి భారీ చిత్రంతో నిర్మాత అవతారం ఎత్తాడు. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఆ తర్వాత అతిథి లాంటి మరో భారీ చిత్రాన్ని నిర్మిస్తే అది కూడా నిరాశ పరిచింది. దీంతో ఇక సినిమాలు ఆపేశారాయన. దూకుడు, ఆగడు సినిమాలకు ప్రెజెంటర్‌గా మాత్రం వ్యవహరించారు. దూకుడు బ్లాక్‌బస్టర్ అయినా.. ఆగడు డిజాస్టర్ అవడంతో పూర్తిగా సినిమాల నుంచి తప్పుకున్నాడు. మొత్తానికి కృష్ణ ఘన వారసత్వం ఉన్నప్పటికీ.. రమేష్ సినీ రంగంలో నిలదొక్కుకోకపోవడం విచారకరమే. కొన్నేళ్లుగా అస్సలు వార్తల్లో లేని ఆయన.. ఇప్పుడిలా మరణ వార్తతో అందరినీ విషాదంలోకి నెట్టారు.
This post was last modified on January 9, 2022 2:44 am
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…