ఈగ సినిమాతో తెలుగులో తనదైన ముద్ర వేశాడు కన్నడ నటుడు సుదీప్. పెర్ఫామెన్స్ పరంగా ఆ సినిమాలో అతనే హైలైట్. సినిమా అంత పెద్ద సక్సెస్ కావడంలో అతడి పాత్ర కీలకం. ఐతే తొలి సినిమాతో అంత పెద్ద బ్రేక్ వచ్చినా.. తెలుగులో కెరీర్‌ను నిర్మించుకోలేకపోయాడు సుదీప్. యాక్షన్ త్రీడీ, బాహుబలి సినిమాల్లో తన స్థాయికి తగని పాత్రల్లో మెరిసి మాయమయ్యాడు.
అతడికి తగ్గ పాత్రలు తెలుగు దర్శకులు ఇవ్వలేదా.. లేక అతనే ఇక్కడి అవకాశాల్ని కాదనుకున్నాడా అన్నది తెలియదు. గత కొన్నేళ్లలో తెలుగులో మళ్లీ ఏ సినిమా చేయలేదు. ఐతే సుదీప్ తెలుగులోకి మళ్లీ బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నది తాజా సమాచారం. అతను సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే కొత్త సినిమా సర్కారు వారి పాటలో సుదీపే విలన్ పాత్ర నటిస్తాడని ఆసక్తికర ప్రచారం సాగుతోంది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే, అందులో ఎంత పెద్ద నటుడు నటిస్తే హీరో, అతడి పాత్ర అంతగా ఎలివేట్ అవుతాయన్న ఉద్దేశంతో సుదీప్‌ను పరశురామ్ పట్టుకొస్తున్నాడని.. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని.. మహేష్ సినిమా కాబట్టి సుదీప్ ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు.
ఇదే నిజమైతే మహేష్, సుదీప్ కాంబినేషన్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. సంగీత దర్శకుడిగా మాత్రం తమన్ ఓకే అయ్యాడు. పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం అందించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
This post was last modified on June 11, 2020 12:14 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…