టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మళ్లీ సోగ్గాడి సందడికి రంగం సిద్ధమైంది. ఆరేళ్ల కిందట సంక్రాంతి టైంలోనే వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. నాగ్ కెరీర్లోనే అది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం విశేషం. పోటీలో వేరే భారీ చిత్రాలుంటే వాటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచిందా చిత్రం. ఆ సినిమాకు హైలైట్‌గా నిలిచింది బంగార్రాజు పాత్రలో నాగార్జున చేసిన అల్లరి, ఆయన పండించిన రొమాన్సే. తెలుగు తెరపై ఇలాంటి రొమాంటిక్ క్యారెక్టర్ చూసి అప్పటికి చాలా కాలం అయింది.
ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, యువ కథానాయిక లావణ్య త్రిపాఠి నాగ్‌కు జోడీగా నటించగా.. ఇంకా అనుష్క, అనసూయ తదితరులు క్యామియో రోల్స్‌లో సందడి చేశారు. వాళ్లందరితో కలిసి నాగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సినిమాకు అదే హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ‘బంగార్రాజు’లోనూ ఇలాంటి సయ్యాటలు చూడబోతున్నాం. ఈసారి నాగ్‌కు తోడు నాగచైతన్య కూడా అమ్మాయిలతో రొమాన్స్ పండించబోతున్నాడు.
‘బంగార్రాజు’లో నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించడం తెలిసిందే. ఇక ‘జాతిరత్నాలు’ భామ ఫరియా అబ్దుల్లా ఒక పాటలో సందడి చేయడమూ విదితమే. ఐతే వీరికి తోడు ఇంకో ఐదుగురు హీరోయిన్లు సినిమాలో సందడి చేయబోతున్నారట. ‘బంగార్రాజు’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ విషయాన్ని వెల్లడించాడు. సినిమాలో ఆరేడుగురు హీరోయిన్లున్నారట నిజమేనా అని విలేకరులు అడిగితే.. మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు కనిపించబోతున్నారని బదులిచ్చాడు. ఐతే వాళ్లెవ్వరన్నది వెల్లడించలేదు.
లడ్డుండా పాటలో కనిపించిన చోటా మోటా హీరోయిన్లను కూడా కలిపి ఎనిమిది మంది అన్నాడా.. లేక వేరే వాళ్లు ఈ సినిమాలో సందడి చేశారా అన్నది తెలియదు. ఇక ఈ చిత్రం నిడివి గురించి అడిగితే 2 గంటల 34 నిమిషాలని కళ్యాణ్ కృష్ణ వెల్లడించాడు. ‘సోగ్గాడే..’లో చిన్న నాగార్జునగా కనిపించిన రాము పాత్ర ఇందులో ఉంటుందా అని రెండు మూడు నిమిషాలు కనిపిస్తుందని తెలిపాడు కళ్యాణ్.
This post was last modified on January 8, 2022 9:22 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…