సంక్రాంతి సీజన్లో సందడి చేయాల్సిన భారీ చిత్రాఉల ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా పడటంతో బంగార్రాజు మూవీ డ్రైవర్ సీట్లోకి వచ్చింది. ఆ సినిమాకు ట్రేడ్ వర్గాల్లో మాంచి డిమాండ్ ఏర్పడింది. ఉన్నట్లుండి ఈ సినిమా థియేట్రికల్ హక్కుల రేట్లు పెరిగిపోయినట్లు సమాచారం. ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ కావడం, పోటీలో ఈ స్థాయి సినిమా ఏదీ లేకపోవడంతో బయ్యర్లు కూడా ఫ్యాన్సీ రేట్లకు సినిమాను కొనడానికి రెడీ అయ్యారు.
సంక్రాంతి రోజు విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ రోజు రోజుకూ మారిపోతున్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం విడుదల రోజుకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రెండు మూడు రోజులుగా అనుకుంటున్నట్లే ఏపీలో థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతం తగ్గించేశారు. అలాగే నైట్ కర్ఫ్యూ పెడుతుండటంతో సెకండ్ షోలు రద్దు చేయబోతున్నారు. ఇలాంటి ఆంక్షల మధ్య నాగ్ సినిమాను రిలీజ్ చేసి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో అన్నది సందేహంగా మారింది.
పోటీలో వేరే చిత్రాలు కూడా ఉన్నప్పటికీ.. బంగార్రాజుపైనే అందరి దృష్టీ ఉంది. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ కూడా ఆ సినిమా కోసమే చూస్తోంది. దీనిపై పెట్టుబడులు కూడా కొంచెం పెద్ద స్థాయిలోనే ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆంక్షల మధ్య సినిమాను రిలీజ్ చేస్తే ఆశించిన రెవెన్యూ రావడం కష్టమే. ఐతే థియేటర్లు ఎక్కువ సంఖ్యలోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి.. 50 శాతం ఆక్యుపెన్సీతోనూ మంచి రెవెన్యూనే రాబట్టవచ్చు.
గత ఏడాది సంక్రాంతికి క్రాక్ ఇలాంటి స్థితిలోనే భారీ వసూళ్లు తెచ్చుకుంది. కాకపోతే నైట్ షోలు రద్దయితే మాత్రం కష్టమే. కానీ ఇక్కడా ఓ వెసులుబాటు లేకపోలేదు. ఉదయం కాస్త ముందుగానే మార్నింగ్ షోలు మొదలుపెట్టి, కర్ఫ్యూ మొదలయ్యే సమయానికి నాలుగో షోను పూర్తి చేయొచ్చు. కానీ వారం తర్వాత కరోనా తీవ్రత ఇంకెంత పెరుగుతుందో.. అసలు థియేటర్లు పూర్తిగా మూతపడకుండా అందుబాటులో ఉంటాయా.. సినిమా రిలీజ్ చేశాక మధ్యలో రన్ ఆగిపోయే పరిస్థితి వస్తే ఎలా అన్న సందేహాలు చిత్ర బృందాన్ని కలవర పెడుతున్నాయి.
This post was last modified on January 8, 2022 3:21 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…