1945.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొత్త సినిమా. ఐతే పేరుకే ఇది కొత్త చిత్రం. ఇది మొదలైంది ఆరేళ్ల కిందట. బాహుబలి తర్వాత రానా ఒప్పుకుని లీడ్ రోల్ చేసిన సినిమాల్లో ఇదొకటి. తమిళ దర్శకుడైన సత్య శివ ఈ చిత్రాన్ని రూపొందించాడు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు. ఈ సినిమాలో అడ్రస్ లేకుండా పోయింది.
కొన్నేళ్ల పాటు దీని గురించి చర్చే లేదు. కానీ ఉన్నట్లుండి నెల కిందట ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. దీని రిలీజ్ గురించి సి.కళ్యాణ్ మీడియాకు సమాచారం ఇచ్చారు. ముందు డిసెంబరు 31న అనుకుని, ఆ తర్వాత డేట్ మార్చి ఆర్ఆర్ఆర్ ఖాళీ చేసిన జనవరి 7న ఈ సినిమాను థియేటర్లలోకి దించారు. చెప్పుకోదగ్గ కొత్త చిత్రాలేవీ లేకపోవడంతో దీనికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్క్రీన్లు దక్కాయి.
ఐతే రానా సినిమా, చారిత్రక నేపథ్యం.. రెజీనా, నాజర్, సత్యరాజ్ లాంటి పేరున్న ఆర్టిస్లులు నటించారు.. ఇవన్నీ చూసి సినిమాలో ఎంతో కొంత విషయం ఉంటుందనుకుని థియేటర్లకు వెళ్లిన వారికి దిమ్మదిరిగింది. ఇది అసలు పూర్తి కాకుండా అసంపూర్తిగా వదిలేసిన సినిమా అని తెలిసి నివ్వెర పోయారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా సరిగా చేయకపోవడం.. సినిమా అతుకుల బొంతలా ఉండటం.. సన్నివేశాల మధ్య కనెక్షన్ కట్ అయిపోవడం.. అన్నింటికీ మించి సినిమాలో రానా పాత్రకు ఇంకెవరో డబ్బింగ్ చెప్పడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.
సినిమా ఫలితమేంటో ముందే తెలిసిపోయిందో, ఇంకేవైనా ఇబ్బందులొచ్చాయో తెలియదు కానీ.. రానా ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేయలేదన్నది స్పష్టం. క్లైమాక్స్‌లో భారీ సన్నివేశం ఊహించుకుంటే కేవలం వాయిస్ ఓవర్‌తో లాగించి ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేశారు. రానా అందుబాటులో లేకపోవడం వల్లో ఏమో క్లైమాక్స్ షూట్ చేయనే లేదని, అలాగే అతనొచ్చి డబ్బింగ్ కూడా చెప్పలేదని అర్థమైంది. బహుశా అప్పటిదాకా తీసిన సినిమా ఔట్ పుట్ నచ్చకో, పారితోషకం విషయంలో తేడా వచ్చో రానా ఈ చిత్రాన్ని వదిలేసినట్లున్నాడు. అందుకే రిలీజ్ టైంలో కూడా దీని గురించి మాట్లాడలేదు. ప్రమోట్ చేయలేదు.
This post was last modified on January 7, 2022 10:25 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె గ్రాడ్యుయేషన్…
వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ బాలకృష్ణ ఖాతాలో వేసిన డాకు మహారాజ్ ఎనిమిది రోజులకు 156 కోట్లకు పైగా గ్రాస్…
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు ఎవరు ఔనన్నా… కాదన్నా… గురుశిష్యులే.…
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోయింది. పండగ సెలవులు పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర పడిపోయింది. యావరేజ్ అయినా అభిమానులు కాస్త…
డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా…
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…