టాలీవుడ్లో మళ్లీ వాయిదాల పర్వం మొదలైనట్లుగా కనిపిస్తోంది. 2020లో కరోనా తొలి దశలో.. గత ఏడాది రెండో దశలో సినిమాలు ఎలా వాయిదా పడ్డాయో.. షెడ్యూళ్లన్నీ ఎలా మారిపోయాయో తెలిసిందే. గత ఏడాది సెప్టెంబరు-అక్టోబరు టైంలోనే కరోనా మూడో వేవ్ వస్తుందని, మళ్లీ సినిమాల విడుదల డోలాయమానంలో పడుతుందని అనుకున్నారు. కానీ వైరస్ తీవ్రత తగ్గుతూ వచ్చిందే తప్ప పెరగలేదు.
ఇక గండం గడిచిందని, మళ్లీ కరోనా భయం పెద్దగా ఉండదని అంతా ధీమాగా ఉన్న టైంలో మళ్లీ పరిస్థితులు మారిపోయాయి. గత కొన్ని రోజుల్లో కరోనా మహమ్మారి విజృంభించడం మొదలైంది. చూస్తుండగానే వేగంగా పరిస్థితులు మారిపోయాయి. కొత్త ఏడాది ఆరంభంలోనే రావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు వాయిదా పడిపోయాయి. వీటి తర్వాత రావాల్సిన భారీ చిత్రాల విడుదల మీదా ఇప్పుడు అయోమయం నెలకొంది.
సంక్రాంతి సినిమాల తర్వాత అందరి దృష్టీ నిలిచి ఉన్నది ఫిబ్రవరి 4న రావాల్సిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘ఆచార్య’ మీదే. ఈ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఫస్ట్ కాపీ రెడీ అయి ఉంటే సంక్రాంతికి విడుదల చేసేవాళ్లు కానీ.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వస్తున్నాయి కదా అని కొరటాల శివ పోస్ట్ ప్రొడక్షన్ పనులు తాపీగా చేసుకుంటున్నాడు. ముందు అన్నట్లే ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితులు సినిమాలకు అంత అనుకూలంగా ఉండే సూచనలు కనిపించడం లేదు.
కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఈ నెలాఖరుకు థర్డ్ వేవ్ పీక్స్ చూస్తామని నిపుణులు అంటున్నారు. అదే జరిగితే.. థియేటర్ల మీద అన్ని చోట్లా ఆంక్షలు తప్పవు. తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ పరిస్థితులు తప్పకపోవచ్చు. ఆ స్థితిలో ‘ఆచార్య’ విడుదల కష్టమే అవుతుంది. ప్రస్తుత పరిస్థితులకే ‘ఆచార్య’ టీంలో నమ్మకం సడలినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వేసవికి వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారట. ఇది వాయిదా పడిందంటే.. ‘భీమ్లా నాయక్’ సైతం ఫిబ్రవరి నెలాఖర్లో రావడం సందేహమే.
This post was last modified on January 7, 2022 4:13 pm
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…