2021 సంవత్సరానికి అదిరిపోయే ముగింపును ఇచ్చింది ‘పుష్ప’ మూవీ. టాక్ పరంగా చూస్తే ఈ చిత్రం నిజానికి అంచనాలను అందుకోలేకపోయింది. తొలి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఐతే మిక్స్‌డ్ టాక్‌ను తట్టుకుని కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. చాలా చోట్ల బయ్యర్లకు మంచి లాభాలు అందించింది.
హిందీ, తమిళం, మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. కన్నడలో కూడా ఓకే. ఐతే తెలుగు వెర్షన్ తెలంగాణలో సక్సెస్ ఫుల్ అనిపించుకున్నా.. ఏపీలో మాత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గానే నిలిచింది. యుఎస్‌లోనూ ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ కాలేదు. ఐతే హిందీలో ఈ చిత్రం అంచనాల్ని మించి ఆడేయడం నిర్మాతలకు బాగా కలిసొచ్చింది. రిలీజ్‌కు ముందు మంచి లాభాలతోనే అన్ని ఏరియాలకు రైట్స్ అమ్మగా.. విడుదల తర్వాత హిందీ నుంచి అదనపు ఆదాయం వచ్చింది.
ఓవరాల్‌గా ‘పుష్ప-1’ సక్సెస్ ఫుల్ అనిపించుకోవడం, ముఖ్యంగా హిందీలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవడంతో ‘పుష్ప-2’కు మంచి బిజినెస్ ఆఫర్లు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప’ వల్ల నష్టపోయిన బయ్యర్లను ఆదుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు సినిమాను తీసుకుంది తమ రెగ్యులర్ బయ్యర్లే కావడంతో వాళ్లు నష్టపోకుండా ఏపీలో వివిధ ఏరియాల్లో ఎంత నష్టం వచ్చిందో చూసి అందులో 50 శాతం దాకా వెనక్కి ఇస్తున్నట్లు సమాచారం.
అంతే కాక ఏపీ వరకు ‘పుష్ప-2’ హక్కుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించబోతున్నారట. ఇలా చేయడం ద్వారా బయ్యర్లలో అసంతృప్తి లేకుండా చూసుకుంటున్నారు. దీని వల్ల మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వచ్చే మిగతా సినిమాలకు కలిసొస్తుంది. ఓవరాల్‌గా ‘పుష్ప’ ద్వారా మంచి లాభాలు అందుతుండటంతో ఈ మాత్రం నష్టాలు భరించడం మైత్రీ వాళ్లకు పెద్ద ఇబ్బందేమీ కాదు.
This post was last modified on January 7, 2022 4:08 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…